Allari Naresh : కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కి సీక్వెల్ పై.. అల్లరి నరేష్ సెన్సషనల్ కామెంట్స్..

Allari Naresh : టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ సినిమాలకి కేరాఫ్ గా సినిమాలు చేస్తూ, బాక్స్ ఆఫీస్ దగ్గర కామెడీ మూవీస్ తో తన కంటూ మంచి పేరు ను మార్కెట్ ను సొంతం చేసుకుని మినిమమ్ గ్యారెంటీ హీరో గా ఒకప్పుడు మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న అల్లరి నరేష్ (Allari Naresh) కెరీర్ లో ప్రస్తుతం చాలా డౌన్ అయ్యాడని చెప్పాలి. అనుకున్న రేంజ్ లో హిట్స్ పడటం లేదు. జబర్దస్త్ వంటి షో ల తర్వాత పేరడీ సినిమాల హవా తగ్గిపోగా, కామెడీ సినిమాలు కూడా కొత్తగా ఉంటె తప్ప జనాలు అసలు పట్టించుకోవడం లేదు. ఇక సీరియస్ సబ్జెక్ట్ అయిన “నాంది” తో కంబ్యాక్ దొరికింది కానీ, సీరియస్ మూవీస్ తో తన మార్కెట్ అయితే అనుకున్న రేంజ్ లో లేదు. ఇలాంటి టైంలో మళ్ళీ కామెడీ జోనర్ లో తన కొత్త సినిమా “ఆ ఒక్కటీ అడక్కు” తో మళ్ళీ కామెడీ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ ముందుకు అల్లరి నరేష్ రాబోతున్నాడు. ఈ సందర్బంగా ప్రమోషన్లలో భాగంగా తన పాత బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్ గురించి ప్రస్తావన వచ్చింది.

సుడిగాడు సీక్వెల్ పై నరేష్ మాట..

ఇక అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి ప్రమోషన్స్ లో అల్లరి నరేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ” సుడిగాడు” సీక్వెల్ పై ప్రస్తావన వచ్చింది. అప్పట్లో అల్లరి నరేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఆ రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించింది. ఇక తాజాగా ఇంటర్వ్యూ లో సుడిగాడు సినిమా కి సీక్వెల్ చేయోచ్చు కదా, అని అడిగిన ప్రశ్నకి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు అల్లరోడు. అల్లరి నరేష్ మాట్లాడుతూ ఆ సినిమా సీక్వెల్ కోసం సరైన కథ కోసం ట్రై చేసినా సెట్ అవ్వలేదని ఇది వరకు చెప్పగా, ఇప్పుడు స్వయంగా తానె సుడిగాడు సినిమా సీక్వెల్ కథను రాస్తున్నానని వచ్చే ఏడాదికి కథ పూర్తి అవుతుంది అంటూ అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు.

కెరీర్ బిగ్గెస్ట్ హిట్..

ఇక అల్లరి నరేష్ నటించిన సుడిగాడు 2012 లో రిలీజ్ కాగా, అప్పట్లో సెపరేట్ తెలంగాణా మూమెంట్ లో వచ్చి అంచనాలను మించిపోయి సుడిగాడు సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించి ఆ రోజుల్లోనే 22 కోట్ల రేంజ్ షేర్ , 44 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అల్లరి నరేష్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న సుడిగాడు సినిమా అంటే ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అలాంటి సినిమాకి సీక్వెల్ కోసం చాలా టైం నుండే ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉండగా, ఇప్పుడు స్వయంగా అల్లరోడు సీక్వెల్ ను కన్ఫాం చేస్తూ వచ్చే ఏడాది ఆ సీక్వెల్ ఆడియన్స్ ముందుకు వస్తుంది, అని చెబుతూ ఉండటంతో ఇక ఆ సినిమాతో అల్లరోడు సాలిడ్ హిట్ కొట్టాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ అల్లరి నరేష్ నటించిన “ఆ ఒక్కటి అడక్కు” మే 3న రిలీజ్ కి రెడీ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు