Net Flix Ott : ప్రపంచంలోనే నెంబర్ వన్.. కానీ ఇండియాలో అట్టడుగున..

Net Flix Ott : ఇండియా లో కరోనా లాక్ డౌన్ తర్వాత ఓటిటి ల హవా పెరిగిపోయిందన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ తర్వాత థియేటర్ల టికెట్ రేట్లు కూడా పెరగడం, అలాగే చిన్న సినిమాలకు లాక్ డౌన్ టైం లో బెస్ట్ ఆప్షన్ గా మారడం, అన్నిటికి మించి సిరీస్ లకు డిమాండ్ పెరగడం వల్ల ఇండియా లో కూడా ఓటిటి ఛానల్ ల సంఖ్య పెరిగిపోయింది. ఇక ఇప్పుడు వస్తున్న స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయి నెల తిరక్కుండానే ఓటిటి లలో వస్తుండడం వల్ల ఆడియన్స్ ఓటిటి లకు ఎగబడిపోతున్నారు. ఇక ఇండియా లో అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, నెట్ ఫిక్స్ లతో పాటు రీసెంట్ గా ఆహా ఓటిటి కూడా ఓ రేంజ్ లో ఎదిగిపోయింది. అయితే ఓటీటీ దిగ్గ‌జాల న‌డుమ పోటాపోటీ వాతావ‌ర‌ణం గురించి తెలిసిందే. అయితే భార‌తదేశంలో ఓటిటి స‌బ్ స్క్రిప్ష‌న్ ల ప‌రంగా ఏ ఓటీటీ నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది? అంటే తాజా లెక్కలతో దానికి స‌మాధానం ల‌భించింది. తాజా డేటా ప్రకారం, భార‌త‌దేశపు సబ్స్ స్క్రైబర్ల విషయంలో హాట్‌స్టార్ ఓటిటి 5 కోట్ల తో అగ్రస్థానంలో ఉంది. ఇక జియో సినిమా 2.8 కోట్లు, అమెజాన్ ప్రైమ్ 2.25 కోట్లు, సోనీ లివ్ 1.25 కోట్లు, జీ5 0.8 కోట్లు, ఆ తర్వాత నెట్‌ ఫ్లిక్స్ ఆరవ స్థానంలో ఉంది. భార‌త‌దేశంలో నెట్ ఫ్లిక్స్ కి కేవ‌లం 0.65 కోట్ల మంది సబ్స్ స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు.

వరల్డ్ లో నెంబర్ వన్.. కానీ ఇండియాలో అట్టడుగున..

అయితే నెట్ ఫ్లిక్ (Net Flix Ott ) ఓటిటి కి భారత దేశంలో ఇంత తక్కువ సబ్స్ స్క్రిప్షన్స్ ఉంటాయని చాలా మంది ఊహించి ఉండరు. కానీ ఇది నిజం. నెట్ ఫ్లిక్స్ కు కేవలం 65 లక్షల మంది సబ్స్ క్రైబర్స్ మాత్ర‌మే ఉన్నారు. నిజానికి మార్చి నాటికి మొత్తం 269.6 మిలియన్ల (సుమారు 27 కోట్లు) స‌బ్ స్క్రైబ‌ర్ల‌తో ప్ర‌పంచంలో నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్న నెట్ ఫ్లిక్స్ ఉండడం విశేషం. కానీ భార‌త‌దేశంలో మాత్రం టాప్ ఓటిటి ఛానల్ లతో అట్టడుగున ఉంది. ఇప్పుడు కూడా మిగతా ఓటిటి ఛానల్ లతో పోల్చుకుంటే సినిమాలు కొనే విషయం లో కూడా నెట్ ఫ్లిక్స్ ఆలోచన అంతంత మాత్రంగానే ఉంది. వెబ్ సిరీస్ లకే నెట్ ఫ్లిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.

సబ్స్ క్రైబర్స్ కోసం ప్లాన్స్ ..

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో 20 కోట్ల మంది సభ్యులతో ప్ర‌పంచ ర్యాంకింగ్‌లో రెండవ స్థానంలో ఉంది. కార‌ణం ఏదైనా కానీ నెట్‌ఫ్లిక్స్ ప్ర‌స్తుత‌ సమయానికి చందాదారుల సంఖ్యలను ప్ర‌క‌టించ‌డాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దానికంటే జ‌నాద‌ర‌ణ ఉన్న‌ ప్లాన్‌ ల విజయాన్ని హైలైట్ చేస్తోంది. ఇది 40 శాతం సైన్ అప్‌లను కలిగి ఉంది. ఆదాయం 14.8 శాతం పెరిగి దాదాపు $9.4 బిలియన్ల (7,835 కోట్లు) కు చేరుకుంది. నిర్వహణ ఆదాయం సంవత్సరానికి 54 శాతం వృద్ధితో $2.6 బిలియన్ల (2,167 కోట్లు)కు చేరుకుంది. అయితే నెట్ ఫ్లిక్స్ భార‌త్ లో అంతంత మాత్రంగా ఉండ‌టానికి కార‌ణం నెట్‌ఫ్లిక్స్ ఫ్యామిలీ తో కలిసి చూడగలిగే కంటెంట్ లను ఎక్కువగా కలిగి లేకపోవడం అని తెలుస్తుంది.
మరి ఈ విషయం పై నెట్ ఫ్లిక్స్ వారు తెలుసుకుని సబ్స్ క్రైబర్లు పెరిగే విధంగా ప్లాన్ చేస్తారా లేదా లైట్ తీసుకుంటారా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు