Prathinidhi2 : వాయిదా పడ్డ ప్రతినిధి2.. ఆ ఇష్యూయే కారణమా?

Prathinidhi2 :  టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ చాలా రోజుల గ్యాప్ తర్వాత నటించిన సినిమా “ప్రతినిధి2”. ఈ సినిమా నారా రోహిత్ ప్రతినిధి సినిమాకి సీక్వేల్ గా తెరకెక్కిందన్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మెప్పించడం తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కాకపోతే ఆడియన్స్ కి ఈ సినిమా రీచ్ కావడానికి మేకర్స్ మరింత ప్రమోషన్స్ చేయాల్సి ఉండగా, అనూహ్యంగా ప్రతినిధి (Prathinidhi2) మేకర్స్ తమ సినిమా రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై టాలీవుడ్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా వాయిదా పడడానికి మామూలుగా టెక్నికల్ ఇష్యూస్ లాంటివి ఎక్కువ కారణాలు అవుతుంటాయి. కానీ ఈ సినిమా వాయిదా పడడం పట్ల మాత్రం ఆడియన్స్ కి వేరే విధంగా ఆలోచిస్తున్నారు.

అఫిషియల్ గా వాయిదా..

ఇక అసలు విషయానికి వస్తే.. నారా రోహిత్ కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ప్రతినిధి-2 సినిమా తో ఆడియన్స్ ని పలకరించడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీతో ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇప్పుడు సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండగా, సడన్ గా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ వారం అంటే రోజుల్లో సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా, ఇప్పుడు ప్రతినిధి 2 సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ప్రతినిధి-2 కాస్త విరామం తీసుకుంటుందంటూ ట్వీట్ చేశారు మేకర్స్. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు సడన్ గా ఈ సినిమా పోస్ట్ పోన్ ఎందుకైందనే విషయంపై అంతా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లోని అనేక డైలాగులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నాయి. దీంతో నెట్టింట ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు పెడుతున్నారు.

అందుకే వాయిదా ?

అయితే మేకర్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోకపోవడం వల్లే రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ సెలవులో ఉన్నారట. అందుకే ప్రతినిధి 2 మూవీ సెన్సార్ పనులు పెండింగ్ లో ఉండిపోయాయని టాక్. అందుకే ఈ చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారని సమాచారం. అయితే నెటిజన్ల అభిప్రాయం ప్రకారం ప్రతినిది 2 సినిమా రాజకీయ కోణంలో ఎన్నికల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడం వల్ల, మరి కొన్ని రోజుల్లో ఎలెక్షన్లు ఉన్నందువల్ల, ఓ రాజకీయ వర్గం సినిమాని వాయిదా వేయించిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఈమయినా ఈ సినిమా ఎన్నికల ముందు వచ్చి ఉంటె సినిమా చూసే కొంతమంది జనాలకు ఓటింగ్ పై ఒక అవగాహన వచ్చి ఉండేదని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దినేష్ రాజ్, సప్తగిరి, జిషు సేన్ గుప్త, సచిన్ ఖడేకర్, అజయ్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ, ఉదయభాను, అజయ్ ఘోష్ తదితరులు నటించారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు