Prathinidhi2 Trailer Talk : సరైన సమయంలో అసలైన దమ్మున్న సినిమా!

Prathinidhi2 Trailer Talk : టాలీవుడ్ లో ఈ మధ్య రాజకీయాల నేపథ్యంలో పలు సినిమాలు రిలీజ్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రిలీజ్ అయిన యాత్ర2 , వ్యూహం, రాజధాని ఫైల్స్ లాంటి చిత్రాలు పూర్తి రాజకీయ నాయకుల బయోపిక్ గా పక్కా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన సినిమాలు కాగా, అవి ఆయా పార్టీలకనుగుణంగా వ్యక్తిగతంగా తీసిన చిత్రాలు కానీ, ప్రజల కోసం, ప్రజలకి అర్ధమయ్యే విధంగా ఎడ్యుకేట్ చేయడం కోసమో రాలేదు. కనీసం ప్రజలకు పాలిటిక్స్ మీద ఆలోచింపచేసేలా ఒక్క సినిమా కూడా ఈమధ్య రాలేదు. అయితే చాలా రోజులకు ఒక అసలైన సినిమా రాబోతుందని తెలుస్తుంది. నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిథి సినిమా గుర్తుండే ఉంటుంది. పదేళ్ల కింద వచ్చిన ఆ సినిమా మంచి విజయం సాధించగా, ప్రజలని ఎంతో ఆలోచింపచేసేలా చేసింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ప్రతినిధి 2 ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఆ సినిమా యొక్క ట్రైలర్ కాసేపటికిందే రిలీజ్ కాగా సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

అసలైన పొలిటికల్ డ్రామా..

తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో హీరో ఒక జర్నలిస్ట్ కాగా, పలు రాజకీయ నాయకుల్ని ఇంటర్వ్యూ చేస్తూ, వాళ్ళు ఇచ్చే పథకాల గురించి, వాళ్ళు ఎదిగిన వైనాల గురించి ప్రస్తావిస్తూ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ పార్ట్ కూడా ఇలాంటి నేపథ్యంలోనే సాగుతుంటుంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో ప్రజలకి కావాల్సిన మంచి పాయింట్ లని సినిమాలో చూపిస్తున్నారని అనిపిస్తుంది. రానున్న నెలలో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే ఎంపీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజలకు రాజకీయ నాయకులపై అవగాహన కల్పించేందుకు సరైన సినిమా వస్తుందని అనిపిస్తుంది. ఇక ట్రైలర్ లో హీరో చెప్పే డైలాగులు కూడా బాగున్నాయి. ముఖ్యంగా లాస్ట్ డైలాగ్ గూస్బంప్స్ తెప్పించేలా ఉంది.
“ఒక్కసారి ఎక్కి కుర్చున్నాడంటే, 5 ఏళ్లు వాడు చెప్పింది చెయ్యాల్సిందే.. డిసైడ్ చేస్కో నిన్ను ఎవరు పరిపాలించాలో.. డిసైడ్ చేస్కో నీకు ఎవరు కావాలో” ఈ డైలాగ్ ఈ జనరేషన్ కి పర్ఫెక్ట్ డైలాగ్ అని చెప్పొచ్చు. అలాగే ట్రైలర్ స్టార్టింగ్ లోనే నారా రోహిత్ వేసిన ప్రశ్న అందర్నీ ఆలోచించేలా చేస్తుంది. కొబ్బరికాయలు అమ్ముకునే స్టేజి నుంచి రాజకీయ నాయకుడు అయినవాడు, వాడి పక్కనే కాయలు అమ్ముకుంటున్న వాడిని ఎందుకు పట్టించుకోవడం లేదు, ఇలాంటి చాలా ప్రశ్నలు ఈ సినిమాలో కనిపించబోతున్నాయని తెలుస్తుంది.

ఏప్రిల్ 25న రిలీజ్..

అయితే ప్రతినిధి 2 ట్రైలర్ (Prathinidhi2 Trailer Talk) రిలీజ్ అయ్యాక సినిమాపై మరింత అంచనాలు పెంచేసిందని చెప్పొచ్చు. కాకపోతే ఆడియన్స్ కి ఈ సినిమా రీచ్ కావడానికి మేకర్స్ మరింత ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే సినిమా రిలీజ్ కావడానికి కేవలం వారం రోజులు మాత్రమే ఉంది కాబట్టి, మేకర్స్ ఎదో ఒక మ్యాజిక్ చేయాలి. ఇక ప్రతినిధి2 సినిమాని ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో దినేష్ రాజ్, సప్తగిరి, జిషు సేన్ గుప్త, సచిన్ ఖడేకర్, అజయ్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ, ఉదయభాను, అజయ్ ఘోష్ తదితరులు నటించారు. మరి ఈ సినిమా ఆడియన్స్ కి ఎంతవరకు రీచ్ అవుతుంది. రానున్న ఎన్నికలపై ఈ సినిమా ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది తెలియాలి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు