Salman Khan : వందల కోట్ల ఆస్తులు ఉన్నా సల్మాన్ ఉండేది 1 బీహెచ్కేలోనే… ఎందుకో తెలుసా?

Salman Khan : గత ఆదివారం నుంచి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర భయంకరమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 5 గంటలకు ఆయన ఇంటి బయట దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కిపడింది. అప్పటి నుంచి సల్మాన్ ఇంటితో పాటు ఆయన ఎక్కడకు వెళ్లినా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం సల్మాన్ ముంబైలోని బాంద్రాలో ఉన్న ఓ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో నివసిస్తున్నారు. మరి సినిమాల ద్వారా కోట్లు సంపాదించే ఆయన ఎందుకు ఒక సింగిల్ బెడ్ రూమ్ లో నివాసం ఉంటున్నాడు? అంటే…

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఎదురైన నేపథ్యంలో ఆయనను ప్రస్తుతం ముంబైలో సల్మాన్ నివాసం ఉంటున్న సింగిల్ బెడ్ రూమ్ నుంచి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కానీ ఆయన మాత్రం ససేమిరా అక్కడి నుంచి కదిలేది లేదని మొండిగా తిష్ట వేసుకుని కూర్చున్నారు. మరి ఈ స్టార్ హీరోకు వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఆ ఇల్లే ఎందుకంత ఇష్టం అంటే…

40 ఏళ్లుగా ఆ ఇంట్లోనే…

సల్మాన్ ఖాన్ గత 40 ఏళ్లుగా గెలాక్సీ అపార్ట్మెంట్ లోనే నివసిస్తున్నారు. అంటే ఆయన హీరో కావడానికంటే ముందే అక్కడ ఇల్లు కొనుక్కున్నారు సల్మాన్ తల్లిదండ్రులు. కానీ ఆయన సూపర్ స్టార్ అయ్యాక కూడా ఆ ఇంటిని విడిచిపెట్టలేదు. ముంబైలోని లగ్జరి ఏరియాలో ఉన్న బాంద్రా అనే సెలెబ్రిటీ ఏరియాలో ఉంది ఈ గెలాక్సీ అపార్ట్మెంట్. అందులోని మొదటి అంతస్థులో సల్మాన్ నివసిస్తుండగా, ఆయన తల్లి సల్మా, తండ్రి సలీం ఖాన్ రెండవ అంతస్థులో నివసిస్తున్నారు.

- Advertisement -

సలీం ఖాన్ తన సంపాదనతో కొన్న ఇల్లు ఇదేనని సమాచారం. తాను కూడబెట్టుకున్న డబ్బుతో సలీం ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ కొన్నాడట అప్పట్లో. అందులోనే ఆయన తన భార్యతో కలిసి అప్పటి నుంచి ఇప్పటిదాకా కాపురం ఉన్నారు. అక్కడే వాళ్లకు సల్మాన్ ఖాన్ తో పాటు ఆయన తోబుట్టువులు అర్బాజ్, అర్పిత, అల్విరాలు పుట్టారు.

ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ గెలాక్సీ అపార్ట్మెంట్లోని తన ఇల్లు మాత్రమే కాకుండా మొత్తం భవనమే తన హృదయానికి దగ్గరగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎందుకంటే తనతో పాటు తన తోబుట్టువులు కూడా అక్కడే పెరిగి పెద్దయ్యారని గుర్తు చేసుకున్నారు. అందుకే ఆయనకు ఈ ప్లేస్ అంటే తనకు అంత ఇష్టమని వెల్లడించారు.

ఆ ఇంటి ధర 100 కోట్లు

గెలాక్సీ అపార్ట్మెంట్ హౌజ్ గురించి సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ మాట్లాడుతూ తనకు ఆ ప్రదేశం చాలా ఇష్టమని, తాను ఎప్పుడైనా ఆ ఇంటిని విడిచి పెడితే బాధగా అనిపిస్తుందని, సంతోషంగా జీవించలేనని చెప్పారు. తను జీవితాంతం ఆ గెలాక్సీ అపార్ట్మెంట్లోనే జీవించాలి అనుకుంటున్నాను అని సలీం ఖాన్ తెలిపారు. సల్మాన్ ఆ ఇంటిని విడిచిపెట్టక పోవడానికి ఇది కూడా ఒక కారణం. కాగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఉంటున్న ఆ ఫ్లాట్ విలువ 100 కోట్లు ఉంటుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు