Raghubabu : నటుడు రఘుబాబు అరెస్ట్..కానీ?

Raghubabu : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా , విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రఘుబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న ఈ నటుడు ఈ మధ్యకాలంలో కాస్త తక్కువ సినిమాలు చేస్తున్నాడు. పెద్ద సినిమాల్లో ఇప్పుడు అంతగా నటించడం లేదు. అయితే అవకాశాలు తగ్గినప్పటికీ అడపా దడపా కొన్ని సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇక టాలీవుడ్ నటుడు గిరిబాబు కొడుకే రఘుబాబు అని మనకి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా నిన్న రఘు బాబు కారును ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు మరణించిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ఎక్కువపోతుంది. తాజాగా నటుడు అరెస్ట్ కావడం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే.. నటుడు రఘు బాబు రెండు రోజుల కింద సాయంత్రం తన బీఎండబ్ల్యూ కారులో హైదరాబాదు నుంచి నెల్లూరు వైపుకు వెళ్తూ ఉండగా, ఆ సమయంలో రఘు బాబు కారుని ఒక బైక్ ఢీ కొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. దీంతో అక్కడి స్థానికులు రఘుబాబు కారుని చుట్టుముట్టడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బిఆర్ఎస్ కార్యకర్త మృతి..

అయితే ఆక్సిడెంట్ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడున్న పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే బైక్ పైన వెళుతూ మరణించిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కావడంతో ఆ వివాదం మరింత రచ్చ చేసారు. కొంతమంది తెలుపుతున్న సమాచారం ప్రకారం రఘు బాబు కారు బైక్ ను దాదాపుగా 50 కిలోమీటర్ల వరకు లాక్కెళ్ళినట్లు అక్కడ కొంతమంది సాక్షులు వెల్లడిస్తున్నారు. ఆ యువకుడు అయితే రాంగ్ రూట్లో రావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తేల్చేశారు. దీంతో నటుడు రఘుబాబు కాస్త ఊపిరిని పీల్చుకున్నారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా అద్దంకి నార్కట్ పల్లి జాతీయ రహదారి పైన చోటు చేసుకోగా, అయితే చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం శ్రీనగర్ కాలనీలో సంధినేని జనార్దన్ రావు దగ్గరలో ఉండే సాయి వెంచర్ కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలియజేశారు.

రఘుబాబు అరెస్ట్..

అయితే ఆక్సిడెంట్ కి గురైన సంధినేని జనార్ధనరావు మృతి చెందగా, అతని భార్య నాగమణి పిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేయగా, తాజాగా నటుడు రఘుబాబు(Raghubabu)ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రఘుబాబు అరెస్ట్ అయిన గంటల వ్యవధిలోనే బెయిల్ పైన రిలీజ్ కావడం జరిగింది. చనిపోయింది ఒక రాజకీయ పార్టీ కార్యకర్త కాబట్టి ఇంత రచ్చ జరగడానికి ఒక కారణం అయితే, అతడు రాంగ్ రూట్లో రావడం రఘుబాబు కి ప్లస్ అయిందని చెప్పొచ్చు. అందుకే వెంటనే బెయిల్ పై బయటికివచ్చాడు. నెటిజన్ల అభిప్రాయం ప్రకారం కార్ డ్రైవింగ్ రూల్స్ ప్రకారం చేసి ఉంటే పెద్దగా నష్టం జరగకపోవచ్చని అంటున్నారు. మరి ఈ కేసు ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు