Raghubabu:రఘుబాబు కార్ యాక్సిడెంట్… కారణం ఇదే..!

Raghubabu.. తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా , విలన్ గా తనకంటూ ఒక సపరేటు క్రేజ్ సంపాదించుకున్నారు నటుడు రఘుబాబు.. అయితే ఈ మధ్యకాలంలో కాస్త అవకాశాలు తగ్గినప్పటికీ అడపా దడపా సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు పలు రకాల ఇంటర్వ్యూలలో కూడా కనిపిస్తూ ఉంటారు. తాజాగా నటుడు రఘు బాబు కారును ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు మరణించినట్లుగా తెలుస్తోంది.. పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

Raghubabu:Raghubabu's car accident... this is the reason..!
Raghubabu:Raghubabu’s car accident… this is the reason..!

రఘు బాబు కారుకి యాక్సిడెంట్..

అసలు విషయంలోకి వెళ్తే.. నటుడు రఘు బాబు నిన్నటి రోజున సాయంత్రం బీఎండబ్ల్యూ కారులో హైదరాబాదు నుంచి నెల్లూరు వైపుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో రఘు బాబు కారుని ఒక బైక్ ఢీ కొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. దీంతో అక్కడి స్థానికులు రఘుబాబు కారుని చుట్టుముట్టడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడున్న పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే బైక్ పైన వెళుతూ మరణించిన వ్యక్తి బీఆర్ఎస్ నాయకుడు అన్నట్లుగా తెలుస్తోంది. రాంగ్ రూట్లో రావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తేల్చేశారు.

బీ ఆర్ ఎస్ నాయకుడు మృతి

దీంతో నటుడు రఘుబాబు కాస్త ఊపిరిని పీల్చుకున్నారు. అయితే ఈ సంఘటన నల్గొండ జిల్లా అద్దంకి నార్కట్ పల్లి జాతీయ రహదారి పైన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నాయకుడి కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం శ్రీనగర్ కాలనీలో సంధినేని జనార్దన్ రావు.. దగ్గరలో ఉండే సాయి వెంచర్ కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలియజేశారు. ఈ ప్రమాదంలో సంధినేని జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తోంది.. మృతుని భార్య నాగమణి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీస్ కేసు కూడా నమోదు చేసి కేసు దర్యాప్తు చేపడుతున్నారు.

- Advertisement -

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.

మృతి చెందిన బీఆర్ఎస్ నాయకుడు సంధినేని జనార్దన్ రావు స్వస్థలం మంగళపల్లి గ్రామం.. జనార్దన్ రావుకు కుమార్తె , ఒక కొడుకు కూడా ఉన్నారు.. ఈ ప్రమాదం అనంతరం రఘుబాబుతో అక్కడ స్థానికులు మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఒక్కసారిగా రఘు బాబు టెన్షన్ పడుతూ ఉన్నట్టుగా పలు రకాల వీడియోలలో కనిపిస్తోంది. మరి కొంతమంది తెలుపుతున్న సమాచారం ప్రకారం రఘు బాబు కారు బైక్ ను దాదాపుగా 50 కిలోమీటర్ల వరకు లాక్కెళ్ళినట్లు అక్కడ కొంతమంది సాక్షులు వెల్లడిస్తున్నారు. మరి అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయం పైన త్వరలోనే పోలీసులు తెలియజేయనున్నారు. నిన్నటి రోజున సాయంత్రం ఈ ఘటన జరగడంతో ఇప్పటికి ఈ విషయం వైరల్ గా మారుతూనే ఉంది.. మరి ఈ విషయం పైన రఘు బాబు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. మొత్తానికి అయితే ఆ ఘటనా స్థలంలో పరిస్థితి చాలా ఉత్కంఠ గా మారింది దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతుండగా అసలు విషయం త్వరలోనే తెలుస్తుంది అని స్పష్టం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు