Teja Sajja Mirai Movie Update : తేజ సజ్జ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్… టైటిల్ గ్లింప్స్ అదిరింది

Teja Sajja Mirai Movie Update : హనుమాన్ ఫేమ్ తేజ సజ్జ నెక్స్ట్ మూవీతో మరోసారి పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న ఈ హీరో కొత్త సినిమాను ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు అంటే ఏప్రిల్ 18న ఈ మూవీ టైటిల్, హీరో ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. మరి ఇంతకీ ఈ టీజర్ ఎలా ఉంది? అంటే…

హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నెక్స్ట్ మూవీ ఏంటి అనే విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎవరు ఊహించని విధంగా తేజ సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేనితో మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. అప్పటికే ఈగల్ మూవీతో డిజాస్టర్ అందుకున్న ఈ డైరెక్టర్ తో తేజ సినిమా అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ మూవీకి మిరాయి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని ఫిల్మీ ఫై ముందుగానే వెల్లడించింది. తాజాగా అదే టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

స్టోరీ రివీల్ చేసిన టీజర్

తాజాగా మేకర్స్ టైటిల్ ఫస్ట్ లుక్ ను రివిల్ చేస్తూ ఓ టీజర్ ను వదిలారు. అందులో మిరాయి అనే టైటిల్ ను సినిమాకు ఫిక్స్ చేసినట్టు అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా స్టోరీ చైనా, జపాన్ సరిహద్దులో ఒక మనిషిని దేవుడి స్థాయికి చేర్చే శక్తి కలిగిన తొమ్మిది పవిత్ర గ్రంధాలను రక్షించే బాధ్యత కలిగిన ఒక పోరాట యోధుడి చుట్టూ తిరుగుతుందని టీజర్ లో వెల్లడించారు. అశోకుడి సీక్రెట్, చరిత్రలో మచ్చగా మిగిలిన ఆయన కళింగ యుద్ధం గురించి ప్రస్తావించారు. తేజ ఇందులో సూపర్ యోధగా కనిపించబోతున్నాడు. మరి ఆయన ఈ గ్రంథాలను ఎలా రక్షిస్తాడు అనే నేపథ్యంలో ఈ మూవీ ఒక సాహసోపేతమైన కథగా రాబోతోంది. ఇక టీజర్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి.

- Advertisement -

రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది

అప్పుడే మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. 2025 ఏప్రిల్ 18న ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులు 2డి అండ్ 3d ఫార్మెట్లలో చూడొచ్చని టీజర్ లో వెల్లడించారు. కాగా ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషలతో పాటు బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో కూడా రిలీజ్ కాబోతుండడం విశేషం. ఈ టైటిల్ టీజర్ ను సైతం ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. మొత్తానికి హనుమాన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత తేజ ఎంచుకున్న ఈ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇటీవల హాయ్ నాన్న మూవీలో కనిపించిన రితిక నాయక్ ఈ అడ్వెంచరస్ డ్రామాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి గౌర హరి సంగీతం అందిస్తున్నారు. ఇక డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మణి బాబు కరణంతో కలిసి స్క్రీన్ ప్లే రాశారు. వివేక్ కూచిబొట్ల ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు