Mayday special movies: కార్మిక నేపథ్యంలో వచ్చిన గొప్ప చిత్రాలు..!

Mayday special movies : ప్రపంచ దేశాల్లో శ్రమజీవులెందరో అలుపెరుగని పోరాటంతో తమ హక్కులు సాధించుకున్న కార్మికుల రోజే ఈ “మేడే”. ఒక మనిషికి రోజుకి 8 గంటలు మాత్రమే పని ఉండాలనే ఉద్దేశ్యంతో అమెరికాలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం ప్రపంచదేశాల్లో అన్నిటా విస్తరించి విజయం సాధించింది. భారతదేశంలో 1923లో ఈ ఉద్యమం లో విజయం సాధించారు కార్మిక సోదరులు. ఇక సమాజ నిర్మాణంలో కీలకమైన ఈ కార్మికుల కథాంశంతో తెలుగులోనూ ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. అటువంటి కొన్ని అభ్యుదయ కార్మిక చిత్రాల్ని కార్మిక దినోత్సవం రోజున ఓ సారి గుర్తు చేసుకుందాం.

శభాష్ రాముడు (1959) :

తెలుగు చిత్ర కథానాయకులు కార్మికుల పాత్రల్లో అనేక చిత్రాలు చేసారు. ఆ రోజుల్లోనే నందమూరి తారక రామారావు బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల్లోనే కార్మిక జెండా అందుకున్నారు. ‘శభాష్‌ రాముడు’లో.. ఘంటసాల గళంతో ‘జయమ్ము నిశ్చయమ్మురా’.. అంటూ కార్మికుల పక్షాన కదం తొక్కారు. ఇందులో ఆయన రిక్షా కార్మికుడిగా కనిపించారు.

ఎర్రమల్లెలు (1981) :

నాంపల్లి స్టేషను కాడా.. రాజాలింగో పాట అందరికి గుర్తుండే ఉంటుంది. ‘అన్యాయం.. అక్రమాలు.. దోపిడీలు.. దురంతాలు.. ఎన్నాళ్లని ఎన్నేళ్లని నిలదీసినదీ రోజే మేడే..’ అంటూ సాగే గీతం, కార్మిక దినోత్సవానికి సిసలైన అర్థం చెబుతూ సాగుతుంది ‘ఎర్రమల్లెలు’ చిత్రంలోని ఈ పాట. 1981 లో వచ్చిన ఈ చిత్రం ఘానా విజయం సాధించింది. కార్మిక నాయకుడిగా, పీడితుల పక్షాన పోరాడే వ్యక్తిగా ఈ చిత్రంలో మురళీమోహన్‌, మాదాల రంగారావు కలిసి నటించి మెప్పించారు.

- Advertisement -

నిప్పురవ్వ (1993) :

నటసింహం నందమూరి బాలకృష్ణ నిప్పురవ్వ అనే చిత్రంలో సింగరేణి కార్మికుడిగా నటించారు. ‘రండి కదలి రండి.. నిదుర లెండి.. కలసి రండి’ అంటూ ఆరోజుల్లోనే సింగరేణి నేపథ్యంలో ఈ చిత్రంలో గొప్ప పాటలు రావడం జరిగింది.

శ్రీరాములయ్య (1999) :

మోహన్ బాబు నటించిన ఈ చిత్రం ప్రతి కార్మిక దినోత్సవాన టీవీల్లో వేస్తుంటారు. శ్రమను నమ్ముకున్న ప్రతి ఒక్కరి గుండెని ఈ చిత్రంలో పాటలు తడుతూనే ఉంటుంది. కర్షకుల కష్టం గురించి చెబుతూ ఎన్. శంకర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు.

ఎర్రసైన్యం (1994) :

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో స్నేహచిత్ర పతాకంపై ఆర్. నారాయణ మూర్తి నటించిన సినిమా ఎర్ర సైన్యం. భూపోరాటల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆరోజుల్లో అఖండ విజయం సాధించింది. ఈ సినిమా స్ఫూర్తి తోనే నారాయణమూర్తి గురువు దాసరినారాయణరావు ఒరేయ్ రిక్షా తీశారు. ఆ సినిమా కూడా హిట్ అయ్యాక ఒసేయ్ రాములమ్మ లాంటి చిత్రాలు తీయడానికి నాంది పలికింది.

అయితే మే డే (Mayday special movies) చిత్రాలు అంటే తెలుగు ప్రేక్షకులందరికీ గుర్తొచ్చే పేరు పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి. ఆయన పాట, పాత్ర.. ఎప్పుడూ పీడితుల పక్షమే.. శ్రమ జీవుల హక్కుల కోసం నారాయణమూర్తి ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. ఆయన కార్మిక కర్షకుల కొరకు తీసిన ఎన్నో చిత్రాలు ఘన విజయం సాధించాయి. ‘ఎర్ర సైన్యం’, ‘ఒరేయ్‌ రిక్షా’, ‘చీమలదండు’, చీకటి సూర్యులు, దళం వంటి చిత్రాలు కార్మిక, కర్షకుల నేపథ్యంలోనే వచ్చి ఘానా విజయం సాధించి ప్రజల్లో చైతన్యం నింపాయి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు