Kajal Agarwal: కాజల్ కోసం రూమ్ బుక్ చేసిన స్టార్ హీరో.. అసలేం జరిగిందంటే..?

Kajal Agarwal..టాలీవుడ్ లో అందాల ముద్దుగుమ్మ గా పేరు పొందిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే తన అందం, అభినయంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరీ నటిస్తూ ఉంటుంది.. అందుకే ఎంతోమంది హీరోలతో నటించి భారీ విజయాలను అందుకుంది. మొదట లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. చందమామ, మగధీర వంటి సినిమాలతో తన కెరీయర్ ను మలుపు తిప్పుకుంది.

Kajal Agarwal..The star hero booked a room for Kajal.. What actually happened..?
Kajal Agarwal..The star hero booked a room for Kajal.. What actually happened..?

టాలీవుడ్ హీరో తో సాన్నిహిత్యం..

టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. వివాహం కాకముందు వరకు కాజల్ అగర్వాల్ పైన పలు రకాల రూమర్స్ అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి.. ముఖ్యంగా కాజల్ అగర్వాల్ టాలీవుడ్ హీరో తో చాలా సన్నిహితంగా ఉండేదని వార్తలు వినిపించాయి.. అయితే కాజల్ అగర్వాల్ మాత్రం ఎక్కువగా స్నేహానికి వ్యాల్యూ ఇచ్చేదట.. ఆ హీరో కూడా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఎక్కువగా చనువుయిస్తూ ఉండేది.. పైగా ఆ హీరోకు కూడా ఈ ముద్దుగుమ్మ అంటే తెగ ఇష్టమట.

హీరో పేరు మాత్రం బయటపెట్టలేదు..

కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు తెలియకుండా ఒక రూమ్ బుక్ చేసి తన ఫ్రెండ్స్ తో ఈమె బర్తడే పార్టీని చాలా గ్రాండ్గా చేశాడట ఆ హీరో. అయితే ఆ రోజంతా కాజల్ అగర్వాల్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి తన పుట్టినరోజును తన ఫ్రెండ్స్ తో కలిసి చాలా ఆనందంగా చేసుకున్నట్లు సమాచారం. అయితే ఆ హీరో పేరు మాత్రం తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.. వివాహమై ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ సినిమాల విషయంలో ఆచూతూచి అడుగులు వేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదరగొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

కాజల్ అగర్వాల్ సినిమాలు..

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే.. సత్యభామ అనే ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన జోడీగా నటించలేకపోతున్న ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోలకు మాత్రం మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గానే ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన ఎలాంటి విషయాలనైనా సరే అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

కాజల్ అగర్వాల్ కెరియర్..

మొదట కళ్యాణ్ రామ్ హీరోగా లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. చందమామ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీగా పేరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత మగధీర సినిమాలో నటించి ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ అయిపోయిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి.. ఇప్పుడు కమలహాసన్ తో భారతీయుడు 2 చిత్రంలో కూడా నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు