HBD Suman Shetty: సహాయం చేసిన డైరెక్టర్ కోసం సుమన్ శెట్టి చేసిన పని తెలిస్తే షాక్..!

HBD Suman Shetty.. తెలుగు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చిన తర్వాత వాటిని నిలబెట్టుకొని సక్సెస్ అవ్వడం అంటే అది ఆషామాషి విషయం కాదు.. కేవలం సెలబ్రిటీల పిల్లలకు మాత్రమే ఇక్కడ చాలా అవకాశాలు దొరుకుతూ ఉంటాయనే భావన ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.. గతంలో టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలుగుతున్న డైరెక్టర్ తేజ ఎంతోమంది నటీనటులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా పరిచయం చేసిన నటులలో సుమన్ శెట్టి కూడా ఒకరు. తాజాగా ఈ రోజున ఈ కమెడియన్ 43వ పుట్టినరోజు సందర్భంగా ఈయన గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

HBD Suman Shetty: Shocking to know what Suman Shetty did for the director who helped..!
HBD Suman Shetty: Shocking to know what Suman Shetty did for the director who helped..!

డైరెక్టర్ కోసం అలాంటి పని

మొదట జయం సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టారు సుమన్ శెట్టి. ఇప్పటివరకు తన సినీ కెరియర్ లో డైరెక్టర్ తేజ..టెక్నీషియన్స్ , హీరో, హీరోయిన్స్ తో పాటూ ఇతరతులను కలిపి వెయ్యి మందికి పైగా తాను ఇంటర్వ్యూ చేశానని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే అలా ఇంటర్వ్యూ చేసిన వారిలో కేవలం కొంతమందికి మాత్రమే ఒక కృతజ్ఞత భావం ఉందంటూ తెలియజేశారు. అందులో కమెడియన్ సుమన్ శెట్టి అంటూ తెలియజేశారు డైరెక్టర్ తేజ.

కమెడియన్ పై తేజ కామెంట్స్

కమెడియన్ సుమన్ శెట్టి గురించి తేజ మాట్లాడుతూ.. సుమన్ శెట్టి ని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చిన కొత్తలో తనకు డబ్బులు బాగానే వస్తున్నాయని చెప్పడంతో ఆ డబ్బుతో ఏదైనా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోమని తనకు సలహా ఇచ్చానని.. ఆ సలహా మేరకే తను కూడా పాటించి ఒక ఇల్లు కట్టుకున్నారని.. అలా ఇల్లు కట్టుకున్న తర్వాత ఓపెనింగ్ కి పిలవడానికి వచ్చినప్పుడు తను తన కాళ్లు పట్టుకోబోయే ఆశీర్వాదం తీసుకుంటుండగా తను కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారట డైరెక్టర్ తేజ.

- Advertisement -

తేజ కాళ్లు పట్టుకోబోయిన సుమన్ శెట్టి..

కానీ కమెడియన్ సుమన్ శెట్టి మాత్రం మీరు నాకు లైఫ్ ఇచ్చారు కచ్చితంగా మీ రుణం తీర్చుకొని అవకాశం నాకు ఇవ్వాలి అంటూ ప్రాదయ పడడంతో.. అప్పుడు తాను ఇలా చెబుతూ తను ఇండస్ట్రీకి కొత్త వారితో సినిమాలు చేస్తూనే ఉంటానని.. అయితే ఏదో ఒక రోజున అన్ని పోగొట్టుకొని రోడ్డున పడితే తనకు ఉండడానికి ఒక చిన్న రూమ్ ఇవ్వగలవా అంటూ అడగగా.. వెంటనే సుమన్ శెట్టి ఎలాంటి విషయం ఆలోచించకుండా ఒక రూముని సిద్ధం చేశాడని తెలిపారు.. అయితే ఇప్పటికీ కూడా ఆ రూమ్లో తన ఫోటో తప్ప ఇంకేమీ లేవని ప్రతిరోజు ఉదయం లేవగానే శుభ్రం చేస్తూ ఉంటాడని కూడా తెలియజేశారు డైరెక్టర్ తేజ.. ఈ విషయం విన్న అభిమానులు సైతం ఆ కమెడియన్ మంచితనానికి గొప్పతనానికి హ్యాండ్సప్ అంటూ తెలియజేస్తున్నారు.. ఇలాంటి యాక్టర్స్ తెలుగు ఇండస్ట్రీకి రావాలని కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సుమన్ శెట్టికి సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు