Pragathi: వాన పాటలో ఆ హీరో అసభ్యంగా ప్రవర్తించారు..!

Pragathi.. ప్రముఖ హీరోయిన్ గా సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరిని ఆకట్టుకుంటూ… ఫైర్ బ్రాండ్ గా ఇమేజ్ దక్కించుకున్న ఈమె ఏ విషయంలో అయినా సరే ముక్కుసూటిగా మాట్లాడడంలో ఈమె తరువాతే ఎవరైనా… తన ప్రవర్తన తీరు వల్లే ప్రగతికి పలు సినిమాలలో అవకాశాలు లభించలేదని స్వయంగా వెల్లడించింది.. ఇకపోతే ఒక హీరో తనతో ప్రవర్తించిన తీరు గురించి ఒక మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించగా ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి..

Pragathi:That hero behaved rudely in the rain song..!

Pragathi:That hero behaved rudely in the rain song..!

వాన పాటలో ఆ హీరో ఇబ్బంది పెట్టారు..

ఈ విషయంపై ప్రగతి మాట్లాడుతూ.. నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక సినిమాలో హీరోయిన్గా నటించాను. ఆ సినిమాకి హీరోనే నిర్మాత.. దర్శకుడు కూడా.. అయితే ఆయన పేరు చెప్పడం ఇష్టం లేదు.. ఆ సమయంలో మాపై ఒక వాన పాట షూట్ చేస్తున్నారు.. అప్పుడు నాకు ఒక డ్రెస్ ఇచ్చి వేసుకోమని చెప్పారు. కానీ అసభ్యంగా ఉండడంతో ఆ దుస్తులు ధరించనను చెప్పాను.. అతడితో నాకు గొడవ జరిగింది..ఆ గొడవ కాస్తా పెద్దగా మారింది .ఆ హీరోయిన్ వేసుకోలేదా? ఈ హీరోయిన్ వేసుకోలేదా? అని అంటే వారి మాదిరిగా నేను వేసుకోలేను..వాళ్ళ మాదిరిగా నేను చేయలేను… అని సూటిగా జవాబు చెప్పాను.. దాంతో అంతను నాతో అసభ్యకరంగా మాట్లాడారు.. నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాను.. ఆ గొడవ పెద్దగా కావడంతో ఇక షూటింగ్ నుంచి నేను ఇంటికి వెళ్లిపోయాను..

వారి ముందే నటించను అని చెప్పా…

అయితే మధ్యలోనే ఇంటికి రావడం చూసి మా అమ్మ ఒక్కసారిగా కంగారు పడింది.. గొడవ జరిగింది మూవీ యూనిట్ వస్తారు.. మీరు కామ్ గా ఉండండి.. వినండి.. నేను వారికి ఏం సమాధానం చెబుతానో..అని అమ్మకి చెప్పా..ను నేను చెప్పినట్టుగానే హీరో కం నిర్మాత నాపై ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయడంతో వాళ్లు మా ఇంటికి వచ్చారు.. నీవల్ల షూటింగ్ క్యాన్సిల్ అయింది.. చాలా నష్టం జరిగింది అని నాతో చెప్పారు.. ఇక నేను కూడా సెట్ లో నాకు జరిగిన ఇబ్బందులను, అవమానాలను వారితో చెప్పాను.. అతడి ముందే వచ్చిన వారితో.. నేను నటించను వాడితో అంటూ తెగేసి చెప్పాను.. అయితే వారు నచ్చ చెప్పడంతో చివరికి నేనే రాజీ పడి ఎలాగోలా సినిమా పూర్తి చేశాను అంటూ చెప్పుకొచ్చింది ప్రగతి..

- Advertisement -

అలాంటి కండీషన్స్ పెట్టాను..

అయితే ఆ సమయంలో కూడా షూటింగ్ కి వెళ్లాలనుకున్నప్పుడు కొన్ని కండిషన్లు పెట్టాను.. నాకు చెల్లించాల్సిన మొత్తం రెమ్యునరేషన్ ఇస్తేనే నేను షూటింగ్ కి వస్తాను అని చెప్పాను .. ఆ గొడవను దృష్టిలో పెట్టుకొని నాకు పారితోషకం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టవచ్చు కదా.. అందుకే నాకు రావాల్సిన డబ్బులు ఇస్తే షూటింగ్ కి వస్తాను అని చెప్పాను.. దాంతో ముందే రెమ్యునరేషన్ మొత్తం ఇచ్చేశారు.. ఆ తర్వాత షూటింగ్ పూర్తి చేశాను.. ఇక ఆ సంఘటన తర్వాత సినిమా పరిశ్రమను వదిలేద్దాం అనుకున్నాను కానీ తప్పని పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో కొనసాగాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది ప్రగతి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు