Eagle on OTT : డైరెక్ట్ గా ఓటిటిలోకి ఈగల్ తమిళ వెర్షన్… థియేటర్లలో బొమ్మ పడేంత సీన్ లేదా?

Ravi teja eagle movie OTT platform: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన రీసెంట్ మూవీ ఈగల్ తమిళ వెర్షన్ తాజాగా ఓటీటీ లోకి వచ్చేసింది. తెలుగులో థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత తమిళ వెర్షన్ రిలీజ్ కావడం విశేషం. అక్కడ థియేటర్లలో రిలీజ్ కు నోచుకోని ఈ మూవీ ఓటిటిలో మాత్రం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈగల్ తమిళ వర్షన్ ను రిలీజ్ చేశారు. ఈగల్ బొమ్మకు తమిళంలో థియేటర్లలో పడేంత సీన్ లేదా? ఎందుకు డైరెక్ట్ గా తమిళ వెర్షన్ ను ఓటిటిలో రిలీజ్ చేశారు? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

ఈగల్ తమిళ వెర్షన్ ఎందుకు థియేటర్లలోకి రాలేదంటే?

ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ముందుగా ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ థియేటర్ల సమస్య కారణంగా ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తమిళ వెర్షన్ మాత్రం కాస్త లేట్ అయినా సరే థియేటర్లలోకి వస్తుందేమో అనుకుంటే తాజాగా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

అమెజాన్ లో తమిళ వెర్షన్…

తెలుగులో మాత్రం ఈగల్ మూవీ రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా కాకముందే ఓటిటిలోకి వచ్చేసింది.. మార్చ్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ విన్ లో ఈగల్ తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఈగల్ తమిళ వర్షన్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఇప్పుడు ఈగల్ తమిళ వెర్షన్ కు అక్కడి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

- Advertisement -

ఈగల్ నష్టాలు…

ఈగల్ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రవితేజ పర్ఫామెన్స్ తో ఇరగదీసినప్పటికీ కథలో కొత్తదనం మిస్సయింది అనే విమర్శ వినిపించింది. ఫస్ట్ 2 డేస్ దూసుకెళ్లిన ఈగల్ ఆ తర్వాత మిక్స్డ్ టాక్ కారణంగా కలెక్షన్లలో చతికిల పడిపోయింది. దాదాపు 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ 15 కోట్లలోపే కలెక్షన్లను రాబట్టి నష్టాలను మిగిల్చింది.

కాగా ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా నవదీప్ కీలక పాత్రలో కనిపించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ మూవీలో రవితేజ తలకోన అడవుల్లో ఉంటూ చేనేత రైతులకు సాయం చేసే సహదేవ వర్మ అనే పాత్రలో నటించాడు. ఆయన ఇంతకీ అక్కడున్న రైతులకు చేసిన మేలేంటి? విదేశాల్లో కాంట్రాక్టు కిల్లర్ గా ఉన్న సహదేవ తలకోన అడవుల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసి తీరాల్సిందే. ఇక ప్రస్తుతం రవితేజ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు