Yuvan Shankar Raja : విజయ్ ఫ్యాన్స్ వల్లే యువన్ ఇన్స్టా డీయాక్టివేట్… అసలు ఏం జరిగిందంటే

Yuvan Shankar Raja : కోలీవుడ్ లోని బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో యువన్ శంకర్ రాజా కూడా ఒకరు. తాజాగా ఆయన తన ఇంస్టాగ్రామ్ ఎకౌంటును డియాక్టివేట్ చేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. దీనంతటికీ కారణం విజయ్ అభిమానులే అంటూ ఫైర్ అవుతున్నారు యువన్ శంకర్ రాజా ఫ్యాన్స్. మరి ఇంతకీ యువన్ ఇన్స్టా ఎకౌంట్ ను డియాక్టివేట్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

యువన్ ఇన్స్టా అకౌంట్ డియాక్టివేట్

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన యువన్ శంకర్ రాజా ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు నుంచి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ విజిల్ పోడు రిలీజ్ అయ్యింది. కానీ ఈ పాట అంచనాలను అందుకోలేకపోయింది. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన ఈ పాటపై చాలామంది విజయ్ అభిమానులు పెదవి విరిచారు.

ఈ నేపథ్యంలోనే యువన్ పై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. యువన్ ను పక్కన పెట్టి ఇటీవల కాలంలో సెన్సేషన్ గా మారిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా విజయ్ అభిమానులు రిక్వెస్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇలాంటి మ్యూజిక్ పనికి రాదనీ, ఇప్పటికైనా మేకర్స్ కళ్ళు తెరిచి ఈ అవుట్ డేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను పక్కన పెట్టేయాలని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే యువన్ శంకర్ రజా తన ఇంస్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేయడం సంచలనంగా మారింది.

- Advertisement -

విజయ్ అభిమానులపై అలకేనా?

అయితే సాంగ్ క్వాలిటీకి సంబంధించి విజయ్ అభిమానుల నుంచి వచ్చిన విమర్శలే యువన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం అయ్యి ఉండవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే యువన్ శంకర్ రాజా ఇంస్టాగ్రామ్ ను డియాక్టివేట్ చేసినప్పటికీ ట్విట్టర్ లో మాత్రం యాక్టివ్ గానే ఉండడం విశేషం. మరి ఇంతకీ ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంస్టాగ్రామ్ కు దూరమవ్వడానికి గల కారణం ఏంటో ఆయనే బయట పెట్టాలి.

ఇదే మొదటిసారి కాదు

కాగా యువన్ సోషల్ మీడియా ఖాతాల నుంచి బ్రేక్ తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆయన 2014లో ఇలాగే ట్విట్టర్ ఎకౌంటును డిలీట్ చేశాడు. మళ్లీ 2015లో ట్విట్టర్ లోకి అడుగు పెట్టాడు. ఈ ఇంట్రెస్టింగ్ పరిణామాల మధ్య యువన్ తన మ్యూజిక్ పనుల్లో బిజీ అయిపోయాడు. ఇటీవల కాలంలో స్టార్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మిస్టర్ జూ కీపర్, మారిసన్ వంటి సినిమాలకు మ్యూజిక్ ఇస్తూ వస్తున్నారు. మరి ఇంతకీ ఆయన ఎందుకు ఇలా ఇంస్టాగ్రామ్ కు బ్రేక్ ఇచ్చారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి విజయ్ అభిమానుల కారణంగా అప్సెట్ అయిన యువన్ వాళ్లపై అలకతోనే ఇలా చేశాడని అంటున్నారు. మ్యూజిక్ బాగా లేదంటే అప్డేట్ కావాలి గానీ ఇలా ఫ్యాన్స్ పై అలగడం ఏంటో వింతగా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు