Crime Web series based on true events : వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ లు… సస్పెన్స్ తో నరాలు కట్ అవ్వాల్సిందే

Crime Web series based on true events : నిజమైన క్రైమ్ స్టోరీస్ ఆధారంగా తెరకెక్కే సినిమాలైనా, సిరీస్ లయినా థ్రిల్లింగ్‌గానే ఉంటాయి. గ్రిప్పింగ్ కథనంతో పాటు హృదయాన్ని కదిలించే ఎమోషనల్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో ఆసక్తికరంగా ఉంటాయి. ఓటిటిలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన అలాంటి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం.

1. ఢిల్లీ క్రైమ్

షెఫాలీ షా, రసిక దుగ్గల్, ఆదిల్ హుస్సేన్, రాజేష్ తైలాంగ్ ఢిల్లీ క్రైమ్‌ వెబ్ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2012లో దక్షిణ ఢిల్లీలో జరిగిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు ఆధారంగా తెరకెక్కింది. ఫస్ట్ సీజన్ 2019 మార్చి 22న, సెకండ్ సీజన్ 2022 ఆగస్టు 26న విడుదలయ్యాయి. రెండు సీజన్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

2. ది రైల్వే మెన్

శివ్ రావైల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో కెకె మీనన్, ఆర్. మాధవన్, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. భోపాల్ లో లీకైన గ్యాస్ వల్ల అల్లకల్లోలమైన జీవితాలు, జనాల ప్రాణాలను కాపాడడానికి రైల్వే శాఖలోని కొంతమంది ఏం చేశారు అనేదే స్టోరీ. 2023 నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చింది ఈ సిరీస్. నాలుగు గంటల నిడివి గల ఈ వెబ్ సిరీస్ ఎపిసోడ్ 1984 భోపాల్ విపత్తు ఆధారంగా తెరకెక్కింది.

- Advertisement -

3. దహాద్

ఇది పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో సోనాక్షి సిన్హా, రీమా కగ్టి, జోయా అక్తర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రీమా కగ్టి, రుచికా ఒబెరాయ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ సీరియల్ కిల్లర్ మోహన్ కుమార్ లైఫ్ ఆధారంగా రూపొందింది. అతన్ని సైనైడ్ మోహన్ అని కూడా అంటరు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

4. స్కామ్ 1992 : ది హర్షద్ మెహతా స్టోరీ

స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా నిజ జీవితం చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ బయోలాజికల్ ఫైనాన్షియల్ సిరీస్. జర్నలిస్టులు సుచేతా దలాల్, దేబాశిష్ బసు రాసిన పుస్తకం ది స్కామ్: హు వోన్, హూ లాస్ట్, హూ గాట్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ లో 1992లో స్టాక్ బ్రోకర్లు చేసిన ఇండియన్ స్టాక్ మార్కెట్ స్కామ్‌ను చూడొచ్చు. హన్సల్ మెహతా దర్శకత్వం వహించగా, ఈ వెబ్ సిరీస్‌లో ప్రతీక్ గాంధీ, శ్రేయ ధన్వంతి, హేమంత్ ఖేర్, సతీష్ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది సోనీలివ్ లో అందుబాటులో ఉంది.

5. స్కూప్

ఈ స్కూప్ సిరీస్ జిగ్నా వోరా జీవితచరిత్ర స్మృతి బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా : మై డేస్ ఇన్ ప్రిజన్ ఆధారంగా రూపొందింది. 2011 జూన్ లో సంచలనం సృష్టించిన మిడ్-డే రిపోర్టర్ జ్యోతిర్మయి డే హత్య ఆధారంగా రూపొందింది. ఈ క్రైమ్ డ్రామా సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం… క్రైమ్ డ్రామా అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టపడే ఓటిటి మూవీ లవర్స్ ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లపై ఓ లుక్కేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు