Asura Guru on OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతున్న తమిళ మూవీ అసుర గురు… తెలుగులో ఎక్కడ చూడొచ్చంటే?

Asura Guru on OTT : అసుర గురు అనే కోలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లలో రిలీజైన నాలుగేళ్ల తరువాత ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది. మరి ఈ మూవీ తెలుగు వెర్షన్ ను ఏ ఓటీటీలో, ఎప్పుడు చూడొచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

డైరెక్ట్ గా ఆహాలో స్ట్రీమింగ్..

సీనియర్ హీరో ప్రభు వారసుడు విక్రమ్ ప్రభు హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ అసుర గురు. 2020లో తమిళంలో రిలీజ్ అయిన ఈ మూవీకి రాజ్ దీప్ దర్శకత్వం వహించగా, మహిమా నంబియార్ హీరోయిన్ గా నటించింది. నాలుగేళ్ల క్రితం కోలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కనీసం పెట్టిన బడ్జెట్లో సగాన్ని కూడా రాబట్టలేకపోయిన అసుర గురు మూవీని ఇన్నేళ్ల తరువాత డైరెక్ట్ గా తెలుగులో ఓటీటీలోకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఓ దొంగ కథను దర్శకుడు రాజ్ దీప్ రూపొందించినప్పటికీ, ఏ మాత్రం ప్రేక్షకాదరణకు నోచుకోలేదు ఈ మూవీ. అసుర గురు మూవీ అదే టైటిల్ తో తెలుగు డబ్బింగ్ వర్షన్ ఆహాలో మే 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

అసుర గురు స్టోరీ…

శక్తి అనే దొంగ పోలీసులకు చిక్కకుండా ధనవంతుల దగ్గర ఉన్న డబ్బును దోచుకుంటూ ఉంటాడు. దివ్య అనే అమ్మాయి అతన్ని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే దివ్య, శక్తి ఇద్దరూ చేస్తున్న పని ఒకటేననే విషయం ఆమెకు అర్థమవుతుంది. సామాన్యులకు సాయపడాలనే సంకల్పంతోనే వాళ్లు ఈ దొంగతనాలు చేస్తున్నారు అనే నిజం వెలుగులోకి వస్తుంది. ఇద్దరి సంకల్పం ఒక్కటే కావడంతో దివ్య ఆ తర్వాత ఏం చేసింది? శక్తి పోలీసులకు దొరికాడా? ఇంతకీ వీరిద్దరి బ్యాగ్రౌండ్ ఏంటి? దివ్య, శక్తి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీని మూవీ చూసి తెలుసుకోవాలి.

- Advertisement -

మూవీ ఫ్లాప్ అవ్వడానికి ఇదే కారణం

అసుర గురు సినిమా ఇంట్రెస్టింగ్ ట్విస్టులు, టర్న్స్ తో సాగుతుంది. పైగా విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ పాత్రల ట్విస్టులు ప్రత్యేకంగా ఉంటాయి. కానీ కథ రొటీన్ గా ఉండడంతో ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

తమిళ మూవీలో తెలుగు నటుడి కీలక పాత్ర…

అసర గురు అనే ఈ తమిళ మూవీలో తెలుగు నటుడు సుబ్బరాజు కీలక పాత్రను పోషించడం విశేషం. బాహుబలి తర్వాత సుబ్బరాజుకి మంచి పాపులారిటీ వచ్చినప్పటికీ తెలుగులో ఆయనకు అవకాశాలు తగ్గాయి. ఇక తమిళంలో అసుర గురు మూవీలో దాదాపుగా బాహుబలి రిలీజ్ అయిన టైంలోనే సుబ్బరాజుకు అక్కడ ఈ సినిమాలో కీలకపాత్రను పోషించే అవకాశం దొరికింది. కానీ మూవీ ఫెయిల్యూర్ కావడంతో సుబ్బారాజుకు దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం ఎన్నో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నా సుబ్బరాజు మాత్రం పెద్దగా ఆ సినిమాల్లో కన్పించక పోవడం గమనార్హం. ఆయన నెక్స్ట్ సినిమాల గురించి కూడా క్లారిటీ లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు