Avatara Purusha 2 on OTT : నాగ్ హీరోయిన్ హార్రర్ మూవీ… భయపడే వాళ్ళు ఈ సినిమాను చూడకండి

Avatara Purusha 2 on OTT : నా సామిరంగా మూవీతో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ నటించిన కన్నడ మూవీ అవతార పురుష 2 అనే హారర్ మూవీ ఓటిటిలోకి వచ్చేసింది. మరి ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు? అంటే….

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

శరణ్ హీరోగా, ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా సుని దర్శకత్వం వహించిన హారర్ మూవీ అవతార పురుష 2. ఏప్రిల్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ నెల రోజులు కూడా కాకముందే ఓటిటిలోకి అడుగు పెట్టేసింది. 2022లో రిలీజ్ అయిన అవతార పురుష మూవీకి సీక్వెల్ గా అవతార పురుష 2 రూపొందింది. మొదటి పార్ట్ లో కూడా శరణ్, ఆషికా రంగనాథ్ లే హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ కాగా సెకండ్ పార్ట్ కు మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ సినిమాలో విజువల్స్, హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయని టాక్ వచ్చింది. కాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంగళవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

అవతార పురుష 2 స్టోరీ…

హిందూ పురాణాల స్ఫూర్తితో డైరెక్టర్ సుని ఈ మూవీ స్టోరీని రాశారు. భూమికి స్వర్గానికి మధ్య ఉన్న త్రిశంకు లోకానికి చేరుకోవడానికి త్రిశంకు మణి అనేది వారధిగా ఉపయోగపడుతుంది. దానిని సొంతం చేసుకోవడానికి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తుండగా, వాటి నుంచి త్రిశంకు మణిని కాపాడే బాధ్యత అనిలా అలియాస్ కర్ణ పై ఉంటుంది. మరి ఈ ప్రయాణంలో కర్ణకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు? ఇందులో సిరి పాత్ర ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను మూవీని చూసే తెలుసుకోవాలి. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ను బాగానే డిసప్పాయింట్ చేసింది. ఫలితంగా ఫుల్ థియేట్రికల్ రన్ లో ఈ మూవీ కేవలం ఐదు కోట్ల లోపే కలెక్షన్స్ ను రాబట్టి షాక్ ఇచ్చింది. కన్నడలో ఇప్పటి వరకు 30కి పైగా సినిమాలు చేసిన ఆషిక అవతార పురుష 2 మూవీతో ఈ ఏడాది శాండల్ వుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని ఆశించింది. కానీ ఈ మూవీ ఫలితం ఆమెను నిరాశపరిచిందనే చెప్పాలి. హారర్ మూవీ లవర్స్ కి మాత్రం ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుందని టాక్ నడుస్తోంది. మరి ఓటిటితో అవతార పురుష 2 మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

- Advertisement -

సెకండ్ మూవీతోనే పాపులర్..

కన్నడ భామ ఆషికా అమిగోస్ అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రిలోకి అడుగు పెట్టింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఆ మూవీ డిజాస్టర్ కావడంతో ఆమె అమిగోస్ సినిమాలో నటించింది అన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయింది. సెకండ్ మూవీ నా సామి రంగాతో ఆషికాకు మంచి గుర్తింపు దక్కింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు