TOP 5 Adventure Movies on OTT : ఓటిటిలో రోమాలు నిక్కబొడుకునేలా చేసే అడ్వెంచర్ థ్రిల్లర్స్… టాప్ 5లో ఉన్న సినిమాలు ఇవే

TOP 5 Adventure Movies on OTT : అడ్వెంచర్ సినిమాలు మనల్ని మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ జానర్ లో వచ్చే సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా చేసి ఉత్కంఠతను రేకెస్తాయి. ఇలాంటి మూవీ ఎక్స్పీరియన్స్ ను ఇష్టపడే అడ్వెంచర్ మూవీ లవర్స్ కోసం ఈరోజు ఐఎండిబిలో టాప్ ప్లేస్ లో ఉన్న 5 ఓటిటి మూవీస్ గురించి తెలుసుకుందాం.

1. ఇంటర్ సెల్లార్

ఇంటర్ సెల్లార్ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. 2014లో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాకు ఐఎండిబి లో 8.7 రేటింగ్ లభించింది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మాజీ నాసా సైంటిస్ట్ మనిషి జీవించడానికి ఇంటర్ సెల్లార్ లో ఉన్న కొత్త భూమిని వెతుక్కుంటూ వెళ్లడం, ఆకాశంలో గెలాక్సీ బయట మనుషులకు ఉండే గ్రహాల అన్వేషణలో అతనితో పాటు వెళ్లిన మిగతా సైంటిస్టులు కూడా ఎలాంటి ఛాలెంజస్ ఎదుర్కొన్నారు అనే ఇంట్రెస్టింగ్ అంశాలతో ఈ మూవీ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఇంటర్ సెల్లార్ మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

2. లైఫ్ ఆఫ్ పై

అనుకోకుండా సముద్రంలో ఓ బోటులో పులి, హైనా వంటి క్రూర జంతువులతో చిక్కుకుపోయిన పటేల్ అనే చిన్న పిల్లాడి చుట్టూ తిరిగే కథే ఈ లైఫ్ ఆఫ్ పై మూవీ. ఆ బోటు నుంచి అతను పులిలాంటి క్రూర మృగాలకు ఆహారం కాకుండా ఎలా బయట పడ్డాడు అనే కథ ఆద్యంతం ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ మూవీకి 7.9 రేటింగ్ ఉండగా, ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

- Advertisement -

3. పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ : ది కర్స్ ఆఫ్ ద బ్లాక్ పెరల్

అడ్వెంచర్ హాలీవుడ్ మూవీస్ అనగానే ముందుగా వినిపించేది హాలీవుడ్ మూవీ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ పేరే. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా ఈ సిరీస్ అంటే ఇష్టం లేని అడ్వెంచర్ మూవీ లవర్స్ ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. 2003లో వచ్చిన పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ : ది కర్స్ ఆఫ్ ద బ్లాక్ పెరల్ మూవీ అద్భుతంగా ఉంటుంది. దీనికి ఐఎండిబి రేటింగ్ 8.1 ఉండగా, హాట్ స్టార్ లో ఈ మూవీని చూడొచ్చు.

4. ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్ : ది ఫెలోషిప్ ఆఫ్ ద రింగ్

ఈ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ప్రేక్షకాదరణ దక్కింది. ఈ మూవీ ఫ్రాంచైజీలో  2001లో రిలీజ్ అయిన లార్డ్ ఆఫ్ ది రింగ్స్ : ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్ మూవీ అత్యధికంగా ఆడియన్స్ ను ఆకట్టుకున్న సిరీస్ గా నిలిచింది. ఈ మూవీకి 8.9 ఐఎండిబి రేటింగ్ ఉండడం విశేషం. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మూవీని నెట్ ఫ్లిక్స్ తో పాటు జియో సినిమా, ప్రైమ్ వీడియోలో కూడా వీక్షించొచ్చు.

5. అప్

ఇది పేరుకే యానిమేషన్ మూవీ గానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చూసి థ్రిల్ అయ్యే అడ్వెంచర్ సన్నివేశాలు ఎన్నో ఈ మూవీలో ఉంటాయి. ఓ వృద్ధుడు తన భార్య కల అయిన ప్యారడైజ్ ఫాల్స్ ను వెతుక్కుంటూ వెళ్లే స్టోరీ ఇది. అయితే ఇందులో అంత పెద్ద వింత ఏముంటుంది? అని అనుకుంటున్నారా? ఆయన వెళ్ళేది ఏదో ఒక బస్ లేదా ట్రైన్ కో కాదు ఏకంగా బెలూన్ల సహాయంతో ఇంటితో సహా ఎగిరి వెళ్లిపోతాడు. ఈ మూవీకి ఐఎండిబి లో 8.3 రేటింగ్ ఉండగా, హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు