Hero Naslen: ప్రేమలు మూవీ పై బన్నీ రియాక్షన్.. ఫహాద్ ఏమన్నారంటే..?

Hero Naslen.. మలయాళం మూవీ గా విడుదలై తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం ప్రేమలు. 2024 మార్చి 8న ప్రేక్షకుల తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. మలయాళం లో గిరీష్ ఏడి దర్శకత్వంలో భావన స్టూడియోస్ బ్యానర్ పై ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్ , శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈ సినిమాని తెలుగులో ఎస్.ఎస్.కార్తికేయ విడుదల చేశారు. నస్లేన్ కే. గఫూర్, మమితా బైజు, అల్తాఫ్ సలీం, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాపై అల్లు అర్జున్ కూడా స్పందించినట్లు సమాచారం..

ప్రేమలు మూవీ పై అల్లు అర్జున్ కామెంట్..

తాజాగా ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఫహద్ ఫాజిల్ కి ఈ సినిమాతో మంచి గుర్తింపు కూడా లభించిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించినట్లు ప్రేమలు సినిమా హీరో నస్లేన్ కే. గఫూర్ వెల్లడించారు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ హీరో మాట్లాడుతూ.. ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం సినిమా సక్సెస్ కావడంతో అభినందించడానికి నేను ఫహాద్ ఫాజిల్ కి ఫోన్ చేస్తే..అప్పుడు ఆయన చెప్పారు పుష్ప 2 ది రూల్ షూటింగ్ సెట్ లో అల్లు అర్జున్ ప్రేమలు సినిమా చూశాను.. చాలా బాగుంది అంటూ చాలా గొప్పగా చెప్పారు అంటూ ఫహాద్ ఫాజిల్ తనతో చెప్పినట్లు నస్లేన్ కే గఫూర్ తాజాగా వెల్లడించారు. ఇకపోతే ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ లాంటి హీరోలు తమ సినిమా గురించి గొప్పగా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. తమ సినిమా విజయం సాధించినా కలగని సంతోషం..ఇంత గొప్ప స్టార్స్ అభినందించడంతో తమ ఆనందం మరింత రెట్టింపు అయిందని ప్రేమలు హీరో వెల్లడించారు.

అల్లు అర్జున్ కెరియర్..

అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే పుష్ప సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.. ఇప్పటికే ఈయన కాంబినేషన్లో అలా వైకుంటపురంలో సినిమా చేసి వారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు మరొకసారి ఈ కాంబినేషన్ తెరపైకి వస్తే ఇక పక్కా కమర్షియల్ హిట్ అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు