Heeramandi OTT Release Date : ఇండియాలోనే కాస్ట్లీయస్ట్ వెబ్ సిరీస్… హీరామండి ఓటిటీ ఎంట్రీ ఎప్పుడంటే?

Heeramandi OTT Release Date : ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ వెబ్ సిరీస్ గా రూపొందిన హీరామండీ మరికొన్ని గంటల్లోనే ఓటిటిలోకి రాబోతోంది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ బుధవారం అంటే మే 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

పాన్ ఇండియా మూవీ బడ్జెట్ తో వెబ్ సిరీస్…

ఓ మిడ్ రేంజ్ సినిమాకే 50 కోట్లకు మించి ఖర్చు పెట్టట్లేదు ఈ రోజుల్లో. కానీ ఏకంగా 200 కోట్లు పెట్టి హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ రూపొందించారు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి. మరి ఈ మూవీ కోసం ఇంత భారీ బడ్జెట్ ఎందుకు పెట్టారు అంటే… సంజయ్ లీలా బన్సాలి తన కెరీర్లో ఇప్పటిదాకా తీసిన దేవదాస్, బాజీరావు మస్తానీ, పద్మావత్, రామ్ లీలా లాంటి సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. ఆయన దర్శకత్వం అంటేనే భారీతనం. ఇలాంటి కళాఖండాలను తెరపైకి తీసుకురావాలి అంటే బడ్జెట్ కూడా భారీగానే ఉంటుంది మరి. ఇక తాజాగా హీరామండి మూవీతో మొదటిసారిగా వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన సంజయ్ లీలా బన్సాలి ఇక్కడ కూడా తన మార్క్ చూపించారు. హీరామండి వెబ్ సిరీస్ కు భారీ బడ్జెట్ ఖర్చుపెట్టి ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ యెస్ట్ వెబ్ సిరీస్ గా రూపొందించారు.

హీరామండీ భారీ తారాగణం

బాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్లు ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. సీనియర్ నటి మనిషా కొయిరాలా, అదితి రావు హైదరి, రిచా చద్దా, సోనాక్షి సిన్హా, సంచిదా షేక్ లాంటి స్టార్స్ అంతా హీరామండీ వెబ్ సిరీస్ లో మెరిశారు. అయితే డైరెక్టర్ బన్సాలి తో పాటు వీళ్ళందరూ కూడా భారీగా రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. సినిమాలో సగం బడ్జెట్ పారితోషికాలు ఇవ్వడానికే సరిపోయిందని టాక్. ఇక సంజయ్ లీలా బన్సాలి ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే నిర్మించారు కూడా.

- Advertisement -

ఎవరెవరి రెమ్యునరేషన్ ఎంత?

హీరామండీ కాస్ట్లీయెస్ట్ వెబ్ సిరీస్ మాత్రమే కాదు ఇందులో నటించిన హీరోయిన్ల పారితోషకం విషయం కూడా హాట్ టాపిక్ గానే మారింది. హీరామండీ వెబ్ సిరీస్ కోసం డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి ఏకంగా 60 కోట్లు పారితోషకంగా తీసుకున్నట్టు టాక్. అలాగే హీరోయిన్స్ సోనాక్షి సిన్హా 2 కోట్లు, అదితి రావు హైదరి 1.5 కోట్లు, మనిషా కొయిరాలా, రిచా చద్దా చెరో కోటి రెమ్యూనరేషన్ అందుకున్నారు.

హీరామండీ మూవీ స్టోరీ ఇదే…

దేశానికి స్వాతంత్రం రాకముందు ఇప్పటి పాకిస్తాన్ లోని లాహోర్ లో కొందరు వేశ్యల  విలాసవంతమైన జీవితాలను, ఆ ఉద్యమంలో వాళ్ల పాత్రలను ఈ సిరీస్ ద్వారా అద్భుతంగా చూపించారు బన్సాలి. ఇక 2021లో అనౌన్స్ చేసిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లోకి రావడానికి ఏకంగా నాలుగేళ్లు పట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు