Mehreen Pirzada : ప్రెగ్నెన్సీ కాదు ఎగ్ ఫ్రీజింగ్… పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది అన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన మెహరీన్

Mehreen Pirzada : సౌత్ హీరోయిన్ మెహరీన్ తాజాగా ఎగ్ ఫ్రీజింగ్ అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. దాన్ని చూశాక ఈ బ్యూటీ ప్రెగ్నెంట్, పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది అనే వార్తలు గుప్పుమన్నాయి. వాటిపై మెహరీన్ స్పందిస్తూ అది ప్రెగ్నెన్సీ కాదు ఎగ్ ఫ్రీజింగ్ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? మెహరీన్ ఎందుకు ఈ ఆప్షన్ ను ఎంచుకుంది? అనే వివరాల్లోకి వెళితే…

మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ ఎందుకు ?

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ ఆ తర్వాత రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కెరీర్ పీక్స్ లో ఉండగానే ఎంగేజ్మెంట్ చేసుకొని ఇకపై సినిమాలు చేయను అనే స్టేట్మెంట్ తో షాక్ ఇచ్చింది. భవ్య బిష్ణోయ్ తో పెళ్లి రద్దు చేసుకున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు మరో షాకిచ్చింది. అనంతరం మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ మెహరీన్ కెరీర్ మొదట్లో చూసిన సక్సెస్ ను ఇప్పుడు మాత్రం అందుకోలేకపోతోంద.

ఈ నేపథ్యంలోనే తాజాగా మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకున్నాను అంటూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో మెహరీన్ గత రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పుడే ఎగ్ ప్రైసింగ్ పూర్తి కావడం సంతోషంగా ఉందని వెల్లడించింది. ఇది తన వ్యక్తిగత విషయం కావడంతో అసలు బయటకు చెప్పాలా వద్దా అని ఆలోచించాలని, కానీ తనలాంటి ఎంతోమంది మహిళలకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోను పోస్ట్ చేసినట్టుగా వెల్లడించింది. ఈ బిజీ ప్రపంచంలో పెళ్లి, బిడ్డ అనే విషయాల్లో చాలామంది మహిళలు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని చెప్తూ తాను మాత్రం భవిష్యత్తు కోసం టెక్నాలజీ సాయంతో ఇలాంటి మంచి నిర్ణయాన్ని తీసుకున్నానని వెల్లడించింది. తల్లి కావడం అనేది తన కల అంటూ, దానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ ను ఎంచుకున్నానని క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి?

దీంతో అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అనే విషయాన్ని జనాలు ఆరా తీయడం మొదలు పెట్టారు. రీసెంట్ గా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడింది. ఇప్పుడు మెహరీన్ ఏకంగా దాన్ని చేసి చూపించింది. మరి ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అంటే… లైఫ్ లో సెటిల్ అవ్వడం వంటి పలు కారణాలతో ఎంతోమంది లేటుగా పెళ్లి చేసుకుంటున్నారు. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు ప్రెగ్నెన్సీ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడే తమ ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకొని, కావలసినప్పుడు పిల్లల్ని కనే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పద్ధతినే ఎగ్ ఫ్రీజింగ్ అని పిలుస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు