Venkatesh: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న విక్టరీ వెంకటేష్ ?

Venkatesh: టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో విక్టరీ వెంకటేష్ చాలా స్పెషల్. విక్టరీ వెంకటేష్… తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలు అడుగుపెట్టాడు. అనంతరం తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్… స్టార్ హీరోగా ఎదిగాడు. venkatesh campaign for congress

దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి మొట్టమొదటగా హీరోగా ఎంటర్ ఇచ్చింది విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్ కంటే పెద్దవాడు అయినా సురేష్ బాబు మాత్రం ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ఇటు సురేష్ బాబు కొడుకులు కూడా సినిమాలు చేస్తున్నారు. కానీ దగ్గుబాటి కుటుంబంలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకుంది విక్టరీ వెంకటేష్ మాత్రమే.

విక్టరీ వెంకటేష్ సినిమాలన్నీ కామెడీ జోనర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లోనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఇండస్ట్రీలో సక్సెస్ హీరోగా మారిన వెంకటేష్ తన పేరును కూడా విక్టరీ వెంకటేష్ గా మార్చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ రాజకీయాలలోకి వస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

దీనికి సంబంధించిన వార్తను అందరు వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి విక్టరీ వెంకటేష్ రాజకీయాలలోకి రావడం లేదు. కానీ కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి కోసం ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగనున్నారు విక్టరీ వెంకటేష్. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి తరఫున విక్టరీ వెంకటేష్ ప్రచారం చేయనున్నారు.

విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రితను రఘురామిరెడ్డి కుమారుడు వినాయక్ రెడ్డి… పెళ్లి చేసుకున్నారు. ఈ తరుణంలో… తన వియ్యంకుడి కోసం విక్టరీ వెంకటేష్ ప్రచారం చేయనున్నారట. మే మొదటి వారంలో ఖమ్మం నియోజకవర్గంలో విక్టరీ వెంకటేష్ ప్రచారం చేయనున్నారని సమాచారం అందుతుంది. ప్రచారానికి గ్లామర్ రోల్ ఉంటే… విజయం ఖాయమనే నేపథ్యంలో… విక్టరీ వెంకటేష్ కూడా రంగంలోకి దిగుతున్నారని సమాచారం అందుతోంది.

కాగ ఖమ్మం నియోజకవర్గంలో మొన్నటి వరకు ఎంపీగా గులాబీ పార్టీకి చెందిన నామ నాగేశ్వరరావు ఉన్నారు. ఆయన ఈసారి కూడా మంచి పోటీ ఇస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వెంకటేష్ వియ్యంకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున దిగుతున్నారు. ఖమ్మం జిల్లా లో భద్రాచలం తప్ప అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు