Ileana D’Cruz: ఆ పని చేయడంతో ఇలియానా కెరీర్ నాశనం ?

Ileana D’Cruz: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కపెట్టలేనంత మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ ఈ హీరోయిన్లలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. మరికొంతమంది అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ వారు చాన్సులు దక్కక విఫలమవుతూ ఉన్నారు. కానీ కొంతమంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే టాప్ మోస్ట్ హీరోయిన్గా మారుతున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన చాలామంది హీరోయిన్లు మొదటి సినిమా హిట్ కాగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిపోతున్నారు.

ఇక మరికొంతమంది హీరోయిన్లు మొదటి సీన్ మాతో సక్సెస్ అయి ఆ తర్వాత అట్టర్ ప్లాప్ అవుతున్నవారు కూడా ఉన్నారు. అయితే… అప్పట్లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన వారిలో ఇలియానా ఒకరు. హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవదాస్, పోకిరి, కిక్ లాంటి బంపర్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీని ఏలింది హీరోయిన్ ఇలియానా. చూడడానికి సన్నగా కరెంటు తీగలా ఉండే ఇలియానా… అప్పట్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చింది.

అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇలియానాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రాక ఆమె కెరీర్ పూర్తిగా అంతరించిపోయింది. మధ్యలో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లడంతో… టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు కరువయ్యాయి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తేనే సినిమాలు చేస్తున్నారు హీరోయిన్ ఇలియానా. లేకపోతే ఖాళీగానే ఉంటూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ లేదా తన హాట్ అందాలను ఆరబోస్తూ కాలం గడిపేస్తోంది హీరోయిన్ ఇలియానా.

- Advertisement -

అయితే తాజాగా తన కెరీర్ నాశనం కావడానికి కొన్ని కారణాలను స్వయంగా ఇలియానా స్పష్టం చేసింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఇండస్ట్రీలో తనకు రావాల్సిన గుర్తింపు సరిగా రాలేదని… అసలు దానికి ఏం కారణము తనకు ఇంకా తెలియలేదని హీరోయిన్ ఇలియానా అన్నారు. బర్ఫీ సినిమాలో నటించాక సౌత్ ఇండస్ట్రీ నుంచి నాకు సినిమా ఆఫర్లు అసలు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అక్కడి నిర్మాతలు అలాగే దర్శకులు నేను బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్… అయ్యానని అనుకున్నారని చెప్పారు ఇలియానా. మంచి కథ అలాగే మంచి ఆఫర్ వస్తే కచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లేదా సౌత్ ఇండస్ట్రీలో ఎక్కడైనా సినిమా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ఇలియానా బహిరంగ ప్రకటన చేసింది. కానీ తనకు మంచి అవకాశాలు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేసింది. కచ్చితంగా సౌత్ ఇండస్ట్రీలో మళ్ళీ సినిమాలు చేయాలని ఎంతో ఆశగా ఉందని ఆమె స్పష్టం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు