Anasuya: రౌడీ హీరోని మళ్లీ కెలికిన అనూ.. జిడ్డు వదలదా..?

Anasuya.. బుల్లితెరపై గత దశాబ్ద కాలంగా ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తూ భారీ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో జబర్దస్త్.. ఈ షో ద్వారా ఎంతోమంది సినిమాలలో అవకాశాలు దక్కించుకొని సక్సెస్ ఫుల్ గా కెరియర్ ను ముందుకు తీసుకు వెళ్తున్నారు.. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ లో దాదాపు 9 సంవత్సరాల పాటు యాంకర్ గా పనిచేసి..తనకంటూ ఒక గుర్తింపును మార్కును క్రియేట్ చేసుకున్న అనసూయ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. గ్లామర్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఈమె తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకునేది.. అన్ని సంవత్సరాలు పని చేసిన ఈమె ఉన్నట్టుండి గత ఏడాది తనకు జబర్దస్త్ లో అవమానాలు ఎదురవుతున్నాయని.. వాటిని తట్టుకోలేక వెళ్ళిపోతున్నాను అంటూ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అలా మొత్తానికైతే జబర్దస్త్ కి శాశ్వతంగా గుడ్ బై చెప్పిన ఈమె ఇప్పుడు సినిమాలలో మరింత బిజీగా మారిపోయింది.

Anasuya: Anasuya Target again by Rowdy hero..!
Anasuya: Anasuya Target again by Rowdy hero..!

విజయ్ దేవరకొండ టార్గెట్..

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మళ్లీ అదే డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా లో నటించిన ఈమె.. ఇప్పుడు దీనికి సీక్వెల్ పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా సినిమాలు, షోలు పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ ఈమె చేసే కామెంట్ పలు సంచలనాలకు దారితీస్తూ ఉంటాయి..

విజయ్ ను వదలని అనసూయ..

విజయ్ దేవరకొండను అనసూయ వదలడం లేదు అని చెప్పవచ్చు. సందర్భం లేకుండా పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడో ముగిసిన అర్జున్ రెడ్డి వివాదాన్ని మరలా తెరపైకి తెచ్చింది.. నటులకు, ఆడియన్స్ కి బాధ్యత ఉండాలని కౌంటర్ వేసింది.. ఇకపోతే 2017 లో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రంతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.. అదే సమయంలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.. అర్జున్ రెడ్డి సినిమాలోని కొన్ని సన్నివేశాల మీద సాంప్రదాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హీరోయిన్ తో లిప్ లాక్ సన్నివేశాలు, ఆమెను కొట్టడం, బెడ్రూం సన్నివేశాలు అన్నీ కూడా వ్యతిరేకతను సృష్టించాయి. యాంకర్ అనసూయ అయితే పెద్ద ఎత్తున నిరసన తెలిపింది .టీవీ డిబేట్లో కూర్చొని అర్జున్ రెడ్డి మూవీ హీరో విజయ్ దేవరకొండను, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలపై విమర్శల దాడి చేసింది..

- Advertisement -

మళ్లీ కెలికిన అనసూయ..

అయితే తాజాగా మళ్లీ ఒక పోస్ట్ పెట్టింది.. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ చిత్రాలను విమర్శిస్తూ.. నటి పార్వతి చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో పోస్ట్ చేసింది. గతంలో పార్వతి, విజయ దేవరకొండ, దీపికా పదుకొనే పాల్గొన్న ఒక కార్యక్రమంలో పార్వతీ మాట్లాడుతూ… అర్జున్ రెడ్డి అయినా కబీర్ సింగ్ అయినా ప్రేమను వ్యక్తం చేయడం కోసం కొట్టడం ఏమిటి ? ఇది హింసను ప్రేరేపించడమే.. ఇలాంటి సన్నివేశాలు చేయకుండా దర్శకులను ఆపలేము… కానీ నటులుగా మనం ఆ చిత్రాలు చేయకుండా ఉండగలం కదా అని తెలిపింది.. ఇప్పుడు పార్వతి చేసిన కామెంట్లను ఉద్దేశిస్తూ అనసూయ ఈ వీడియోని షేర్ చేసి మంచిని చెప్పేందుకు ముందుకు వచ్చిన పార్వతి , ఆయుష్మాన్ ,దీపికా పదుకొనే వంటి వారిని అభినందించండి .. సినిమా అనేది అత్యంత ప్రభావితం చేసే మాధ్యమం అని .. నటులు, ప్రేక్షకులు తెలుసుకోవాలి అంటూ కామెంట్ పెట్టింది అనసూయ.. మొత్తానికైతే మళ్లీ కెలికిన ఈమెపై నెటిజెన్స్ ఏ విధంగా ట్రోల్స్ చేస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు