Samantha Cars Collection : సామ్ కార్ల పిచ్చి… బీఎండబ్ల్యూ నుంచి రేంజ్ రోవర్ వరకు ఆమె గ్యారేజ్ లో ఎన్ని కార్లు ఉన్నాయంటే?

Samantha Cars Collection : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక ఇండస్ట్రిలో కార్లు, వాచ్ ఇలా ఒక్కో సెలబ్రిటికి ఒక్కో దానిపై ఇష్టం ఉంటుంది. అలాగే సామ్ కు లగ్జరీ కార్లు అంటే తెగ ఇష్టం. అందుకే ఈ బ్యూటీ గ్యారేజ్ లో దాదాపు 6 కాస్ట్లీ కార్లు ఉన్నాయి. మరి సమంత దగ్గరున్న కార్ల కలెక్షన్ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

సామ్ ఆస్తి ఎంతంటే?

అతి తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించింది. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ మయోసైటిస్ కారణంగా చాలా నెలలుగా రెస్ట్ మోడ్ లో ఉంది. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్న సామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఏప్రిల్ 28వ సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక సమంత పుట్టిన రోజు జరుపుకోవడంతో దశాబ్ద కాలం పాటు అగ్రనాయకగా కొనసాగిన ఆమె ఆస్తులు ఎంత ? అనే విషయాలను ఆరా తీయడం మొదలుపెట్టారు అభిమానులు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సామ్ ఆస్తుల విలువ ఒక 115 కోట్లు అని తెలుస్తోంది.

రెండు చేతులా సంపాదన…

సమంత సినిమాలతో పాటు యాడ్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటుంది. ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటోంది. అలాగే వ్యాపార సంస్థలు, ఎండార్స్మెంట్ల ద్వారా కూడా బాగానే వసూలు చేస్తోంది. అలాగే శ్యామ్ ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్ ను స్థాపించి, దాని ద్వారా మహిళలకు చిన్నారులకు సాయం అందిస్తోంది. మరోవైపు మిస్ ఇండియా 2016 మొదటి రన్నరప్ సుష్రుతి కృష్ణతో కలిసి సమంత 2020లో సాకి అనే తన ఫ్యాషన్ బ్రాండ్ ను ప్రారంభించింది. ఇంకా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టింది. మొత్తానికి సమంత రెండు చేతులా సంపాదిస్తుండడం విశేషం.

- Advertisement -

కార్ల పిచ్చి..

ఇక సామ్ కు కార్లు అంటే బాగా ఇష్టమట. అందుకే దాదాపు ఆరేడు లగ్జరీ కార్లను కొనేసింది సమంత. మరి ఆమె దగ్గర ఉన్న కార్లు ఏంటి అంటే…. రూ. 1.46 కోట్ల విలువైన పోర్షే కేమాన్ జిటి4, రూ. 3.30 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ జి63 ఎఎమ్‌జి, రూ. 72 లక్షల విలువైన జాగ్వార్ ఎక్స్‌ఎఫ్, రూ. 87  కోట్ల విలువైన ఆడి క్యూ7, రూ 2.26 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, రూ. 1.70 కోట్ల విలువైన BMW 7 సిరీస్ కార్లు ఉన్నాయి సామ్ దగ్గర.

విలాసవంతమైన ఇల్లు..

సమంత ప్రస్తుతం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో నివసిస్తున్న విషయం తెలిసింది. దీంతోపాటే ముంబైలో ఆమెకు 15 కోట్ల రూపాయల విలువైన 3 బిహెచ్కె ఫ్లాట్ పొంది. అదికూడా సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు