Renudesai: తొలిచూపులోనే పడిపోయా.. లవ్ స్టోరీ రివీల్..!

Renudesai.. సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా మరింత క్రేజ్ దక్కించుకుంది రేణూ దేశాయ్.. ఈమె పవన్ కళ్యాణ్ ను ప్రేమించి.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రేణూ దేశాయ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి..నిత్యం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె పలు సందర్భాలలో తన ప్రేమ , పెళ్లి గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రేమ , పెళ్లిళ్లకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ గా మారుతున్నాయి . ఈ క్రమంలోనే రేణూ దేశాయ్ గతంలో చేసినటువంటి ఒక వీడియో మళ్లీ ఇప్పుడు వైరల్ గా మారుతోంది… ఆ వీడియోలో ఈమె పవన్ కళ్యాణ్ పై తన ప్రేమ ఎలా మొదలైంది ?అనే విషయాన్ని వెల్లడించింది.

Renudesai:Fall at first sight.. Love story revealed..!
Renudesai:Fall at first sight.. Love story revealed..!

తొలిచూపులోనే పడిపోయా..

పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా చేస్తున్న సమయంలో పూరి జగన్నాథ్ బద్రి సినిమాకు ఎంపికయ్యారు.. ఇలా కొత్త దర్శకుడుతో పవన్ కళ్యాణ్ సినిమా చేశారు. ఆ సినిమా ఆడిషన్ కోసం రామానాయుడు స్టూడియోకి నేను వెళ్లాను.. అక్కడ నేను కూర్చుని ఉండగా… అప్పుడే పూరి జగన్నాథ్ అక్కడికి వచ్చారు..ఆయనతో పాటు పెద్ద హడావిడి కనిపించింది.. అప్పుడే హీరో వస్తున్నాడు అని అనుకున్నాను కానీ పవన్ కళ్యాణ్ ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా వచ్చి కూర్చున్నారు.అలా ఆయన సింప్లిసిటీ చూసి ఫిదా అయిపోయాను.. మొదటి చూపులోనే ఆయనతో ప్రేమలో పడిపోయాను..తన లవ్ స్టోరీ రివీల్ చేసింది.. ఈ సందర్భంగా రేణూ దేశాయ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి..అలా రేణూ దేశాయ్ తన ప్రేమ గురించి వెల్లడించి మళ్లీ వార్తల్లో నిలిచింది.

పవర్ స్టార్ సినీ ప్రయాణం..

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సౌత్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన అద్భుతమైన నటనతో, మేనరిజంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా పేరు దక్కించుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో నటి గా అప్పుడే కెరియర్ ను మొదలు పెట్టిన రేణూ దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ..వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో విడాకులు తీసుకొని అన్నా లెజినోవా అనే రష్యన్ నటిని వివాహం చేసుకున్నారు… ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటూ పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తోంది.

- Advertisement -

రేణూ దేశాయ్ కుటుంబం..

పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె విడాకుల తర్వాత పూర్తిగా సౌత్ సినీ పరిశ్రమకే కాదు అటు బాలీవుడ్ సినీ పరిశ్రమకు కూడా దూరంగా ఉంటూ ముంబైలోనే పిల్లలని చదివించుకుంటూ జీవితాన్ని గడిపేస్తోంది.. కరోనా సమయంలో ఎంతోమంది అనాధలను ఆదుకున్న రేణూ దేశాయ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు విషయాలపై స్పందిస్తూ ఉంటుంది.. చివరిగా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు..

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు