Rebel Moon 2 on OTT : పిచ్చెక్కించే యాక్షన్ సీక్వెన్స్… మరికొన్ని గంటల్లోనే ఓటిటిలోకి సైన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ రెబెల్ మూన్ 2

Rebel Moon 2 on OTT : యాక్షన్ ప్రియులకు కిక్ ఇవ్వడం కోసం రెబల్ మూన్ పార్ట్ 2 ఓటిటిలో మరికొన్ని గంటల్లోనే ల్యాండ్ కాబోతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం హాలీవుడ్ మూవీ లవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాక్ స్నైడర్ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో…

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో జాక్ స్నైడర్ కూడా ఒకరు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన రెబల్ మూన్ పార్ట్ 1 : ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ అనే మూవీ డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చేసింది.. కానీ ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. జాక్ స్నైడర్ టేకింగ్ పై ఉన్న ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ దీనికి కారణమయ్యాయి. మూవీ ఓవరాల్ గా బాగున్నప్పటికీ జాక్ స్నైడర్ వంటి డైరెక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన సినిమా ఇది కాదనే కామెంట్స్ వినిపించాయి. మొత్తానికి రెబల్ మూన్ సీక్వెల్ మరికొన్ని గంటల్లోనే ఓటీటీ లోకి రాబోతోంది. రెబల్ మూన్ ది స్కార్గివర్ టైటిల్ తో సెకండ్ పార్ట్ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.

తెలుగులో కూడా…

ఏప్రిల్ 19 నుంచి అంటే శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ మోస్ట్ అవైటింగ్ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఏప్రిల్ 19 అర్ధరాత్రి నుంచే రెబల్ మూన్ 2 నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాలు పెరిగిపోయాయి. మరి రెండవ పార్ట్ అయినా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జాక్ స్నైడర్ మూవీ అనిపించుకుంటుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

- Advertisement -

ఫస్ట్ పార్ట్ స్టోరీ ఏంటంటే?

రెబల్ మూన్ 2 మూవీ చూడాలి అనుకునేవారు ముందుగా ఫస్ట్ పార్ట్ ను చూడాల్సి ఉంటుంది. రెబల్ మూన్ ఫస్ట్ పార్ట్ 2023 డిసెంబర్లో నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక స్టోరీలోకి వెళ్తే మదర్ వరల్డ్ ను శాసించే అట్టికస్ నోబుల్ ను ఎదిరించడానికి కొంతమంది తిరుగుబాటుదారులను కలుసుకుంటుంది కోరా. ఆ క్రమంలో ఏర్పడిన సమస్యలతో రెబల్ మూన్ ఫస్ట్ పార్ట్ బాగానే ఉంటుంది. అయితే ఫస్ట్ పార్ట్ లో అట్టికస్ నోబుల్ ను చంపేశామని కోరా టీం భావిస్తుంది. కానీ అతను బ్రతికే ఉన్న సీన్ తో రెబల్ మూన్ చైల్డ్ ఆఫ్ ఫైర్ కంప్లీట్ అయ్యింది. దీంతో సెకండ్ పార్ట్ పై క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ ఇంట్రెస్టింగ్ సినిమాకు కొనసాగింపుగా రెబల్ మూన్ పార్ట్ 2 ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. ఇక ట్రైలర్లో యాక్షన్ సీన్స్, బిజిఎం పిచ్చెక్కించే రేంజ్ లో ఉన్నాయి. యాక్షన్ ప్రియులకు ఈ మూవీ తప్పకుండా కిక్ ఇస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు