Jr NTR : అనుపమ్ ఖేర్‌పై తారక్ ట్వీట్… ఇలానే చేయండి అంటూ పోస్ట్

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో కూడా ఆయన అంటే అభిమానం చూపించే సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ విషయంలో ముంబైలో తారక్ మేనియా నడుస్తోంది. బాలీవుడ్ లో ఆయన ఫ్యాన్స్ సంఖ్య పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా తారక్ నామ జపమే జరుగుతోంది. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ కేర్ తారక్ పై తన అభిమానాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు.

తారక్ పై అనుపమ్ ఖేర్ స్పెషల్ పోస్ట్..

బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తారక్ పై అభిమానాన్ని బయట పెట్టారు. ఎన్టీఆర్ తాను అభిమానించే వ్యక్తి అని, అలాగే ఆయన నటన అంటే కూడా ఇష్టమని పోస్ట్ చేశారు అనుపమ్. నిన్న రాత్రి అతన్ని కలిశాను. అంతకంతకూ తారక్ ఎనర్జీ రెట్టింపు అవుతోంది. డే బై డే మరింత షైన్ అవుతాడు. జైహో అంటూ తారక్ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు అనుపమ్. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా వీళ్ళిద్దరూ నిన్న రాత్రి వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారని సమాచారం.

- Advertisement -

ఎన్టీఆర్ రిప్లై..

అనుపమ్ ఖేర్ ట్వీట్ కు తారక్ కూడా వినయంగా రిప్లై ఇచ్చి అందరి మనసులను దోచుకున్నాడు. “నాకు బాగా నచ్చిన నటుడి పనితనం వర్ణనాతీతం. ఆయన స్వయంగా ప్రశంసించడం సంతోషంగా ఉంది. రాబోయే తరాల నటులకు మీరు స్ఫూర్తినిస్తూనే ఉండండి సార్” అంటూ అనుపమ్ పై తన అభిమానాన్ని బయట పెట్టాడు తారక్. ఈ నేపథ్యంలోనే అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఎన్టీఆర్ డౌన్ టు ఎర్త్ స్వభావానికి ముగ్ధులవుతున్నారు నెటిజన్లు.

తారక్ కు ముంబై ఫిదా

తారక్ ముంబైలో అడుగు పెట్టిన క్షణం నుంచే ఆయన గురించి వార్తలు మొదలయ్యాయి. ఇంకా ఫస్ట్ మూవీ కూడా పూర్తికాక ముందే బాలీవుడ్ వాళ్లతో బాగా కలిసిపోతున్నాడు తారక్. ఓవైపు వార్ 2 షూటింగ్ చేస్తూనే మరోవైపు బాలీవుడ్ సెలబ్రిటీలతో పార్టీలు అంటూ ఇంటరాక్షన్ పెంచుకుంటున్నారు. రీసెంట్ గా ఆయన తన భార్యతో కలిసి ముంబై రెస్టారెంట్లో సెలబ్రిటీలతో కలిసి పార్టీలో మునిగిపోయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ మూవీ లవర్స్ కూడా తారక్ ను తెగ ఇష్టపడుతున్నారు. ఆయన ఎక్కడ కనిపించినా సెల్ఫీలు దిగడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. బీ టౌన్ సెలబ్రిటీలు కూడా తారక్ తో కలిసి పని చేయడానికి ఎగ్జైట్ అవుతుంటే, ఇప్పటికే పని చేసిన వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఆయనతో పని చేసిన అనుభవం అద్భుతంగా ఉందంటూ పొగడ్తలతో తారక్ ను ఆకాశనికెత్తేస్తున్నారు. వార్ 2 మూవీ రిలీజ్ కాకముందే హడావిడి అక్కడ ఈ రేంజ్ లో ఉంటే, ఆ మూవీ రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ మేనియా ముంబైని ఊపేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు