Top 10 OTT Releases : ఈ నెల రోజుల్లో ఓటిటిలో రిలీజైన టాప్ 10 ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే

Top 10 OTT Releases : ప్రతి వారం ఓటిటిలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతాయన్న విషయం తెలిసిందే. అయితే అందులో ప్రతి ఒక్కటి హిట్ అవుతుందన్న నమ్మకం లేదు. కొన్ని సినిమాలు థియేటర్లలో నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే, ఓటిటిలో మాత్రం మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. ఇక గత 30 రోజుల్లో ఓటీటీలోకి ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ట్రెండింగ్ లో నిలిచింది మాత్రం కొన్ని సినిమాలే. ఇప్పుడు టాప్ 10 రీసెంట్ ఓటిటి సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

1. డ్యూన్ పార్ట్ 2

ఈ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఏప్రిల్ 16న అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు బుక్ మై షోలో స్ట్రీమింగ్ మొదలైంది. అయితే ఈ రెండు ఓటిటిల్లో కూడా ఇప్పటికైతే డ్యూన్ పార్ట్ 2 రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను మీరు కూడా చూసేయండి.

2. అమర్ సింగ్ చంకీల

పంజాబీ సింగర్ అమర్ సింగ్ చంకీల జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో దిల్జిత్ దోసంజ్, పరిణితి చోప్రా హీరో హీరోయిన్లుగా నటించారు. అమర్ సింగ్ చంకీల మూవీ డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 12న రిలీజ్ అయింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

- Advertisement -

3. ప్రేమలు

మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలు కూడా ఈ నెలలోనే ఓటీటీలోకి అడుగు పెట్టింది. నస్లీన్ కే గఫూర్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ లవ్ కామెడీ మూవీ ఆహలో తెలుగు వెర్షన్, మలయాళం, కన్నడ, తమిళ వెర్షన్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏప్రిల్ 12న ఒకేసారి అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ అయింది.

4. ఓం భీమ్ బుష్

శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ మూవీ ఓం భీం బుష్. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ట్రెండింగ్ లో ఉంది.

5. తంత్ర

అనన్య నాగళ్ల, ధనుష్ రాఘవమూడి ప్రధాన పాత్రలు పోషించిన తెలుగు హర్రర్ మూవీ తంత్ర. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 5న ఆహాలోకి వచ్చింది. థియేటర్లలో రిలీజ్ అయిన 20 రోజులకే ఈ మూవీ ఓటిటిలో అడుగుపెట్టింది.

6. గామి

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ ప్రధాన పాత్ర పోషించిన ప్రయోగాత్మక మూవీ గామి. విద్యాధర కాగిత దర్శకత్వం వహించిన ఈ అడ్వెంచరస్ మూవీ ఏప్రిల్ 12న జి5 లోకి వచ్చింది. ఇక ఈ మూవీ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతుండడం విశేషం.

7. చారి 111

కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన స్పై కామెడీ థ్రిల్లర్ చారి 111. ఏప్రిల్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు కానీ, ఓటిటిలో మాత్రం అదరగొడుతోంది.

8. లంబసింగి

బిగ్ బాస్ దివి, భరత్ రాజ్ హీరో హీరోయిన్లుగా నటించిన లంబసింగి మూవీ ఏప్రిల్ 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

9. అదృశ్యం

అపర్ణ బాలమురళి, హరీష్ ఉత్తమన్ ప్రధాన పాత్రలు పోషించిన అదృశ్యం మూవీ ఏప్రిల్ 4 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

10. శర్మ అండ్ అంబానీ

ఈ మూవీ ఏప్రిల్ 11న డైరెక్ట్ గా ఈటీవి విన్ లోకి వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు