The RajaSaab Update : నిధితో అదిరిపోయే స్టెప్పులు… ప్రభాస్ లుక్ లీక్

Prabhas raja saab movie update : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసింది. ప్రస్తుతం దాదాపు అరడజను సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రెబెల్ స్టార్ ఒక్కో సినిమాను నెమ్మదిగా పూర్తి చేస్తూ ముందుకెళ్తున్నారు. రీసెంట్ గా కల్కి 2898 ఏడీ మూవీ షూటింగ్ పూర్తి కాగా, నెక్స్ట్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ మూవీ సెట్స్ కు మూవ్ అయ్యారు ప్రభాస్. తాజాగా ఈ మూవీ సెట్స్ లో ప్రభాస్ సందడి చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

ప్రభాస్ లుక్ లీక్… సాంగ్ కోసమే

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ ది రాజా సాబ్ మూవీలో కీలకపాత్రలో నటిస్తోందని గత కొన్ని రోజుల నుంచి రూమర్లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ రూమర్లే ఇప్పుడు నిజం అవుతున్నాయి. తాజాగా హైదరాబాదులో వేసిన ది రాజా సాబ్ మూవీ సెట్ లో నిధి అగర్వాల్ కనిపించడంతో ఆమె కూడా ఈ మూవీలో భాగమనే విషయంపై క్లారిటీ వచ్చినట్టుగా అయింది. ఈ సినిమా షూటింగ్ కోసమే ఆమె హైదరాబాద్ కు వచ్చారని, తాజా షెడ్యూల్లో కొన్ని రోజుల పాటు ప్రభాస్, నిధి మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.

కాగా ప్రస్తుతం మేకర్స్ ప్రభాస్, నిధి అగర్వాల్ మధ్య ఒక అదిరిపోయే సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమా కోసం సెట్లో కాలు పెట్టిన ప్రభాస్ లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ప్రభాస్ క్యాజువల్ డ్రెస్ లో కనిపిస్తున్నారు. టోపీ పెట్టుకుని తన లుక్ ను కవర్ చేయడానికి ఆయన ప్రయత్నించినప్పటికీ, గడ్డం, పొడుగు జుట్టుతో స్టైలిష్ గా కనిపించారు ప్రభాస్. అచ్చం ది రాజా సాబ్ మూవీ ఫస్ట్ లుక్ లో ఉన్నట్టుగానే ప్రభాస్ ఉండడంతో ఆయన అభిమానులు ఫుల్ గా ఎగ్జైట్ అవుతున్నారు. చాలా రోజుల నుంచి ప్రభాస్ లుక్ పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ లేటెస్ట్ లుక్ చూస్తుంటే వాళ్లందరికీ ఈ మూవీతో మారుతీ గట్టిగానే ఇచ్చి పడేసేలా కనిపిస్తున్నాడు.

- Advertisement -

మరో అప్డేట్

ప్రభాస్ స్నేహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ కు థియేటర్లలో పూనకాలు వచ్చేలా ఉండబోతున్నాయట సాంగ్స్. చాలా రోజులుగా ప్రభాస్ నుంచి అదిరిపోయే మాస్ బీట్ కోసం ఎదురు చూస్తున్నారు రెబెల్ స్టార్ అభిమానులు. వాళ్లకు ఇక ది రాజా సాబ్ మూవీ థియేటర్లలో పండగే అని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు