AlluArjun : అల్లు అర్జున్ భార్య ఇలా షాకిచ్చిందేంటి?

AlluArjun :టాలీవుడ్‌ ఇండస్ట్రీ చాలా పెద్దది. అందులో చాలా మంది కపుల్స్‌ ఉంటారు. కానీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. భార్యాభర్తలు బంధం అంటే ఇలా ఉండాలి అనేలా ఉంటారు. వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంటకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో స్నేహ రెడ్డికి కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్నేహ రెడ్డి హీరోయిన్ కాకపోయినా స్టార్ హీరోయిన్ కి ఉన్నంతగా ఫాలోయింగ్ ఉంది.

ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి వారి పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ జంట తరచూ వెకేషన్స్ కి వెళ్తూ అక్కడ ఫోటోలను దిగుతూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ పర్సనల్ విషయంలో ఓ అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఆ విషయంలో స్నేహ రెడ్డి కాస్త సీరియస్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ రేంజ్ చూశాక ప్రతి ఒక్క హీరోయిన్ తనతో సినిమా తీయాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు జంటగా రష్మిక నటించిన విషయం తెలిసిందే. ఇక పుష్ప-2 సినిమాలో కూడా వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు.

వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుండడంతో మరో సినిమా కూడా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో అల్లు అర్జున్ తో సినిమా తీయాలని ప్రతి ఒక్క హీరోయిన్ అతనితో టచ్ లో ఉంటున్నారట. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ అల్లు అర్జున్ కి తరచూ ఫోన్ చేస్తూ కాస్త క్లోజ్ గా ఉందట. దీంతో బన్నీ ఆ హీరోయిన్ ని చాలా సింపుల్ గా తీసుకున్నారట. కానీ ఆ హీరోయిన్ హద్దులు మీరి ప్రవర్తించిందట. అల్లు అర్జున్ ని బుట్టలో వేసుకోవాలని తెగ ప్రయత్నాలు చేసిందట. ఈ విషయాన్ని అల్లు అర్జున్ పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ ఆ హీరోయిన్ మాత్రం కాస్త క్లోజ్ గా మాట్లాడిందట. ఇక ఈ విషయం స్నేహ రెడ్డికి తెలిసింది. తన భర్తతో అంత క్లోజ్ గా ఉండడం చూసిన స్నేహ రెడ్డి ఆ హీరోయిన్ కి ఫోన్ చేసి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిందట.

- Advertisement -

ఇంకోసారి నా భర్తకు ఫోన్ చేస్తే యాక్షన్ మరోలా ఉంటుందని బెదిరించిందని టాక్ వినిపిస్తోంది. ఇక అంతే అప్పటి నుంచి ఆ హీరోయిన్ బన్నీకి ఫోన్ చేయడం లేదట. దీంతో ఆ హీరోయిన్ కి సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోయాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక అప్పటినుంచి అల్లు అర్జున్ ఏ హీరోయిన్ తో కూడా ఫోన్లో మాట్లాడడం లేదని సమాచారం. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి హీరోయిన్ కి మించిన అందంతో ఉంటుంది. గత కొంతకాలంగా స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలని చూపిస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది స్నేహ రెడ్డి. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు