Game Changer: పూర్తి షూటింగ్ షెడ్యూల్

జెంటిల్మెన్ సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శంకర్. ఆ సినిమాతోనే మొదటి హిట్ అందుకొని ఆ తర్వాత పలు సినిమాలు చేస్తూ టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే శంకర్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అంతా పాన్ ఇండియా, పాన్ ఇండియా అని అనుకుంటున్నారు గాని, ఒకప్పుడు శంకర్ సబ్జెక్టులన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేవని చెప్పొచ్చు.

అయితే శంకర్ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. శంకర్ తో సినిమా చేయాలని చాలామంది స్టార్ హీరోలు కూడా ఒకప్పుడు పోటీపడే వాళ్ళు. వారిలో చిరంజీవి కూడా ఒకరు. అయితే శంకర్ 17 ఏళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన తర్వాత దర్శకుడుగా మారాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ కి శంకర్ ఎంత పెద్ద అభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో శంకర్ కూడా చెబుతూ వచ్చాడు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివాజీ అనే సినిమాను తెరకెక్కించాడు శంకర్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది.

ఆ తర్వాత శంకర్ చేసిన రోబో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మంచి కలెక్షన్స్ ను తెచ్చిపెట్టింది. అయితే ఆ తరుణంలోనే మెగాస్టార్ చిరంజీవి శంకర్ దర్శకత్వంలో తను కూడా సినిమా చేయాలని ఆశపడుతున్నట్లు ఒక స్టేజ్ పైన చెప్పుకొచ్చారు. అయితే ఆ కోరిక చిరంజీవికి నెరవేర లేదు కానీ చిరు తనయుడు అయిన రామ్ చరణ్ తేజ్ మాత్రం ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. శంకర్ ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న సినిమా గేమ్ చేంజర్. రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. చరణ్ సరసన ఈ సినిమాలో కీయరా అద్వానీ నటిస్తుంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

ఈ సినిమా ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో జరగబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. రీసెంట్గా ఐదు రోజులు షెడ్యూల్ హైదరాబాద్లో జరుపుకుంది ఈ చిత్ర యూనిట్. ఈ షూటింగ్ ఎల్బీ స్టేడియంలోను మరియు హైదరాబాద్ ఎయిర్పోర్టులో సునీల్, రామ్ చరణ్, ఎస్ జె సూర్య మధ్య కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు. అయితే నేటి నుండి ఈ సినిమా టీం చెన్నైలో వరుసగా మూడు రోజులు షూటింగ్ జరపనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ షూటింగ్లో చరణ్ పాల్గొననున్నాడు.

చెన్నై లో షూటింగ్ తర్వాత మళ్లీ రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ జరగబోతుంది. అయితే ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ అవ్వటం అనేది రామ్ చరణ్ తో పాటు శంకర్ కూడా బాగా అవసరమని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు