Rajinikanth Biopic : శివ కార్తికేయన్ బెస్ట్ ఛాయిస్

తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటులలో ధనుష్ ఒకరు. ధనుష్ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే కేవలం ధనుష్ నటుడుగా మాత్రమే కాకుండా మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. ఇదివరకే ఎన్నో సినిమాలకు కథలను రాస్తూ, మాటలను రాస్తూ తన టాలెంట్ను ప్రూవ్ చేసుకున్నాడు. చాలా పాటలను కూడా రచించాడు ధనుష్. అలానే తనలోని దర్శకున్ని కూడా బయటకు తీశాడు. ప్రస్తుతం ధనుష్ ఒక సినిమాకి దర్శకత్వం కూడా చేస్తున్నాడు. ఇకపోతే ఇళయరాజా బయోపిక్ లో ధనుష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలానే ఇప్పుడు మరో బయోపిక్ లో కూడా ధనుష్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్ లో ధనుష్ నటిస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకి తమిళ నటుడు అయిన కూడా చాలామందికి ఫేవరెట్ హీరో అని చెప్పొచ్చు. రజినీకాంత్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి. రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. 70 ఏళ్ల ఏజ్ లో కూడా రజిని స్టైల్ కి, రజిని ఆటిట్యూడ్ కి, రజనీకాంత్ స్క్వాగ్ కి ఒక రకమైన ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు.

ఇకపోతే రీసెంట్ గా జైలర్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు రజనీకాంత్. అయితే ఇప్పుడు అందరికీ సూపర్ స్టార్ గా సుపరిచితులైన రజినీకాంత్ జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఉన్నాయి. రజనీకాంత్ జీవితం ఒక బస్ కండక్టర్ దగ్గర మొదలుపెట్టి నేడు సూపర్ స్టార్ అయ్యే రేంజ్ కు ఎదిగారు. అయితే ఈ ప్రయాణాన్ని అంతటినీ కూడా ఒక బయోపిక్ లో తీసే ఆలోచనలో ఉన్నారు ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా.

- Advertisement -

ఇకపోతే ఇదివరకే ఎంఎస్ ధోని, భాగ్ మిల్కా బాగ్, మహానటి సావిత్రి ఇలా ఎన్నో బయోపిక్ లు బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన ఘన విజయాన్ని సాధించాయి. ఇకపోతే ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఒక కమర్షియల్ సినిమాకి సరిపడా అన్ని ఎలిమెంట్స్ కూడా రజనీకాంత్ జీవితంలో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఎగ్జాక్ట్ గా రజనీకాంత్ స్టైల్ ని మ్యాచ్ చెయ్యాలి అని అంటే మాములు విషయం కాదు.

ఇదివరకే శివ కార్తికేయన్ చాలా సందర్భాల్లో రజినీకాంత్ ని ఇమిటేట్ చేస్తూ వచ్చారు. అయితే శివ కార్తికేయన్ ఐతే ఈ సినిమాకి బెస్ట్ అని కొంతమంది అభిప్రాయం. అలానే ధనుష్ ని తక్కువ అంచనా వేయలేము. ఒక విధంగా చెప్పాలంటే ధనుష్ ఎప్పుడు ఇమిటేట్ చేయకపోయినా కూడా ఒక నటుడుకి ఉండాల్సిన టాలెంట్ ఉంది. కాబట్టి రజనీకాంత్ ను కూడా తనలో చూపించగలిగే సామర్థ్యం ఉంది అని చెప్పొచ్చు.

దీనిని ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా ఇండియన్ లాంగ్వేజెస్ లో ప్రొడ్యూస్ చేయడానికి బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తుంది. సాజిత్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్లో సికందర్ అనే ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది. ఇకపోతే రజినీకాంత్ బయోపిక్ కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు