Suhas About Prasanna Vadanam review : క్షణక్షణం ఉత్కంఠం.. మూవీ ఎలా ఉందంటే..?

Suhas About Prasanna Vadanam review: వినూత్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనదైన నటనా ప్రతిభ తో అందరినీ ఆకట్టుకుంటున్న యంగ్ హీరో సుహాస్ తాజాగా భారతీయ తెరపై ఇప్పటివరకు చూడని ఒక కథను మీ ముందుకు తీసుకొస్తున్నాము అంటూ వెల్లడించారు.. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం “ప్రసన్న వదనం”.. మే మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి అర్జున్ వై. కె. దర్శకత్వం వహించారు.. ఫేస్ బ్లైండ్ నెస్ నేపథ్యంలో ఇదివరకు విదేశీ భాషల్లో సినిమాలు వచ్చినా మన దేశంలో మాత్రం ఇటువంటి కథలు రాలేదు.. అర్జున్ ఫేస్ బ్లైండ్ నేపథ్యంలో చెప్పిన ఈ కథ వినగానే చాలా బాగా నచ్చింది.. సినిమాని సర్టిఫై కి వెళ్లడానికి ముందే చాలామందికి ఈ కథ వినిపించాము.. ఓటిటి సంస్థల దగ్గరకు ఈ కథను తీసుకెళ్లాము. అయితే ఆహా సంస్థకి మా కథ నచ్చడంతో ఈ సినిమాకి నిర్మాణంలో భాగమయ్యారు. మైత్రి, హోమ్ భలే సంస్థలు ఈ సినిమాని పంపిణీ చేస్తున్నాయి.. విడుదలకి ముందే మేము లాభాల్లో ఉన్నాము అంటూ సాఫ్ట్వేర్ రంగం నుండి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ చిత్ర యువ నిర్మాత జె.ఎస్. మణికంఠ తెలిపారు.

Suhas About Prasanna Vadanam review : Momentary excitement.. How is the movie..?
Suhas About Prasanna Vadanam review : Momentary excitement.. How is the movie..?

ప్రసన్న వదనం సినిమాపై సుహాస్ రివ్యూ..

ఇక తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రసన్న వదనం సినిమా కథ గురించి ఈ సినిమా హీరో సుహాస్ రివ్యూ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుహాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా థియేటర్లలో చూసినప్పుడు మీరు క్షణక్షణం ఉత్కంఠకు గురవుతారు.. సినిమాలో ప్రతి సన్నివేశం మిమ్మల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చొనేలా చేస్తుంది.. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ మీలో మొదలవుతుంది.. ఆ సీన్ పూర్తయిన వెంటనే సీన్ అదిరిపోయిందని.. తప్పకుండా మీరు అనుకుంటారు.. గట్టిగా క్లాప్స్ కూడా కొడతారు.. సినిమా అయిపోయాక సూపర్ సాటిస్ఫాక్షన్ తో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు అంటూ సుహాస్ ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చారు. ఇక సుహాస్ ఇచ్చిన ఈ రివ్యూ అభిమానులలోనే కాదు సినీ ప్రేక్షకులలో కూడా ఆసక్తిని కలిగిస్తోంది.. మే మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం సరికొత్త కథాంశం తో తెరపైకి రానున్న విషయం తెలిసిందే. మరి ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి..

సుహాస్ సినిమాలు..

సుహాస్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి ఆ తర్వాత 2018లో విడుదలైన పడి పడి లేచే మనసు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టారు.. ఆ తర్వాత కలర్ ఫోటో చిత్రంతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేశారు.. ఈ సినిమా ఉత్తమ తెలుగు చిత్రం కేటగిరిలో జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది.. ఈ సినిమా కంటే ముందు మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి . ఆ తర్వాత రంగ్ దే , అర్థ శతాబ్దం, గమనం, ఫ్యామిలీ డ్రామా, హెడ్స్ అండ్ టేల్స్ వంటి చిత్రాలలో కూడా నటించారు.. ఇక ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈయన శ్రీరంగనీతులు సినిమాలో కూడా నటించారు.. ఇక ఇప్పుడు త్వరలో ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు