16 Years for Parugu: ఆ రోజుల్లోనే కలెక్షన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

16 Years for Parugu.. ఫైనల్ గా పరుగు మూవీకి పదహారేళ్లు.. అల్లు అర్జున్ హీరోగా , షీలా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పరుగు.. 2008 మే 1న విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.. ముఖ్యంగా అల్లు అర్జున్ కెరీర్ లో దేశముదురు వంటి కెరియర్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత అల్లు అర్జున్ నుండి వచ్చిన చిత్రం ఇది.. అయితే ఇది పక్కా క్లాస్ సినిమా.. ఫలితంగా మొదట మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఆ తర్వాత నిర్మాత దిల్ రాజు బాగా ప్రమోట్ చేయడంతో రెండో వారం నుండి పికప్ అయ్యి భారీ వసూళ్ళు అందుకుంది.. మరి ఫుల్ రన్ ముగిసే సరికి ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టింది ..అప్పట్లోనే ఏ విధంగా కలెక్షన్లను సొంతం చేసుకుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

పరుగు కలెక్షన్స్ ప్రాంతాల వారీగా ఏ విధంగా రాబట్టింది అంటే..

నైజాం : రూ.6.30 కోట్లు

- Advertisement -

సీడెడ్ : రూ.2.70 కోట్లు

ఉత్తరాంధ్ర : రూ.3.13 కోట్లు

ఈస్ట్ : రూ.0.79 కోట్లు

వెస్ట్ : రూ.0.72 కోట్లు

గుంటూరు : రూ.1.70 కోట్లు

కృష్ణ : రూ.1.32 కోట్లు

నెల్లూరు : రూ.0.76 కోట్లు

ఏపీ + తెలంగాణ : రూ.17.42 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా + ప్లస్ ఓవర్సీస్ : రూ.2.61 కోట్లు

మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.20.03 కోట్లు

ఇకపోతే దేశముదురు చిత్రం భారీ కలెక్షన్ ను రాబట్టింది.. ఆ ధీమా తోనే పరుగు చిత్రాన్ని రూ.18.6 కోట్లకు కొనుగోలు చేశారు బయ్యర్స్ .. మరి పూర్తి రన్ ముగిసే సరికి ఈ సినిమా రూ.20.03 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. దీనితో బయ్యర్లకు రూ.1.7 కోట్ల వరకు లాభాలు అయితే మిగిలాయి.. మొత్తానికి అయితే 16 సంవత్సరాల క్రితమే కోటికి పైగా లాభం అంటే మామూలు విషయం కాదు.. మొత్తానికైతే ఈ సినిమా అప్పట్లో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకొని.. అటు బయ్యర్లకు ఇటు నిర్మాతకి మంచి లాభాలను అందించిందని చెప్పవచ్చు.

అల్లు అర్జున్..

ఇక అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే .. పరుగు సినిమా తర్వాత ఆచితూచి అడుగులు వేస్తూ భారీ హిట్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు.. ముఖ్యంగా ఈయన కెరియర్ లో ఎన్నో క్లాస్ , మాస్ సినిమాలు ఉన్నప్పటికీ ఈయనను పాన్ ఇండియా హీరోగా మార్చింది మాత్రం పుష్ప సినిమా అనే చెప్పాలి.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సౌత్ తో పాటు నార్త్ లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది .. నార్త్ లో ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలైనా సరే అక్కడ రూ .100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది.. దీంతో ఈ సినిమా సీక్వెల్ ను ప్రకటించారు.. ప్రస్తుతం ఈ సినిమా కూడా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగస్టు 15వ తేదీన విడుదల కానున్న పుష్ప 2 సినిమా మరో ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమైందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు