Ilayaraja sent notice to Coolie Producers : చిక్కుల్లో రజనీకాంత్ మూవీ… నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిన ఇళయరాజా

Ilayaraja sent notice to Coolie Producers : రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ మూవీ టీజర్‌లో తన సంగీతాన్ని అనధికారికంగా ఉపయోగించుకున్నందుకు సంగీత స్వరకర్త ఇళయరాజా ఆ మూవీ ప్రొడ్యూసర్స్ సన్ పిక్చర్స్‌కు నోటీసు పంపారు.

ఇళయరాజా పాటతో చిక్కుల్లో సన్ పిక్చర్స్..

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్‌ను టీజర్ ద్వారా చిత్ర బృందం ప్రకటించింది. ఈ టీజర్‌కు అభిమానుల నుంచి కూడా విశేష స్పందన లభించింది. అనిరుధ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. కూలీ టైటిల్ టీజర్లో తంగమగన్‌లో ఇళయరాజా పాడిన “వా వా పాకం వా” పాటను రీ క్రియేట్ చేశారు. దీంతో అనుమతి లేకుండా తన సంగీతాన్ని కూలీలో వాడినందుకు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌కి ఇళయరాజా నోటీసు పంపారు. ఇలా చేయడం కాపీరైట్ చట్టం 1957 ప్రకారం ఇది కూడా నేరమేనని నోటీసులో పేర్కొన్నారు. టీజర్‌లో వాడిన “వా వా పేజ్ వా” సంగీతానికి ఇళయరాజా అనుమతి తీసుకోవాలని, లేకుంటే సంగీతాన్ని తొలగించాలని అన్నారు. తన సంగీతాన్ని తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇళయరాజా ఆ నోటీసుల్లో హెచ్చరించారు. ఈ నోటీసుపై లోకేష్ కనగరాజ్ కానీ, సన్ పిక్చర్స్ కానీ, అనిరుధ్ కానీ ఇంకా స్పందించలేదు.

ఇళయరాజా తీరుపై విమర్శలు

కొన్నాళ్ళ నుంచి మ్యూజిక్ కాపీ రైట్ విషయంలో ఇళయరాజా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది సినీ పరిశ్రమలో చాలా మందికి మింగుడు పడట్లేదు. కాపీరైట్ సమస్య కారణంగా అభిమానులు కూడా ఇళయరాజాపై విమర్శలు చేస్తున్నారు. సంగీతం అందించినందుకు మీకు డబ్బులు ఇచ్చేస్తారు. కాబట్టి ఆ సంగీతం మీకు మాత్రమే చెందుతుందని అనడం సరికాదు అంటున్నారు సోషల్ మీడియా వినియోగదారులు.

- Advertisement -

వైరాముత్తు వర్సెస్ ఇళయరాజా సోదరుడు..

నిన్నటి నుంచి ఇళయరాజా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఓ సినిమా కార్యక్రమంలో వైరముత్తు మాట్లాడుతూ భాష, సంగీతం కలగలిసి ఉంటుంది. కొన్నిసార్లు సంగీతం కంటే భాష గొప్పది. కొన్నిసార్లు సంగీతం భాష కంటే గొప్పది. దీన్ని అర్థం చేసుకున్నవాడు తెలివైనవాడు, లేనివాడు అజ్ఞాని అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
వైరముత్తు ప్రసంగాన్ని చూసిన ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ ఆయనకు వార్నింగ్ ఇస్తూ వీడియోను విడుదల చేశారు. వైరముత్తుకు అహంకారం ఎక్కువైందని, అతను మంచి కవి కానీ మంచి మనిషి కాదు. అతనికి తెలివి లేదు. ఇళయరాజా గురించి ఇలాగే మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నోరు అదుపులో పెట్టుకోవాలని వీడియోలో ఆమరన్ హెచ్చరించటం గమనార్హం.

 

లోకేష్ కనకరాజ్ వర్సెస్ ఇళయరాజా..

దర్శకుడు లోకేష్ కనకరాజ్ అనుమతి లేకుండా పాటను రీమిక్స్ చేయడం కొత్తేమీ కాదు. లోకేష్ కనకరాజ్ పై గతంలో కూడా ఇళయరాజా ఫైర్ అయ్యారు. విక్రమ్ సినిమాలో వచ్చిన “విక్రమ్ విక్రమ్” పాటకు ఆయన అనుమతి తీసుకోలేదని, అదే విధంగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ‘బైట్ క్లబ్’ చిత్రం కూడా ‘ఎన్ జోడి మంజ కురువి’ పాటలోని సంగీతాన్ని అనుమతి లేకుండా రీక్రియేట్  చేశారనే ఆరోపణలు వచ్చాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు