50Years for Alluri Seetharama Raju : ఎన్టీఆర్ – కృష్ణల మధ్య చిచ్చు పెట్టిన సినిమా… ఆ టైంలో అసలేమైంది అంటే…?

50Years for Alluri Seetharama Raju : నట శేఖర సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన “అల్లూరి సీతారామరాజు” చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తెలుగు చలనచిత్రసీమలో స్వాతంత్రోద్యమ నేపథ్యంలో వచ్చిన గొప్ప దేశభక్తి చిత్రమిది. స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం లో నటశేఖరుడు కృష్ణ అత్యద్భుతంగా నటించి మెప్పించారు. ఎంతలా అంటే ఆ పాత్రలో కృష్ణ ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేరు. ఆ రోజుల్లోనే నిర్మాతలకు కల్లెక్షన్ల వర్షం కురిపించడమే గాక తెలుగు చలన చిత్ర రికార్డులని తిరగరాసింది ఆ చిత్రం. అయితే నిజానికి అల్లూరి సీతారామరాజు బయోపిక్ ని ఎన్టీ రామారావు తెరకెక్కిద్దామని అనుకున్నారు. అంతలోనే కృష్ణ మొదలుపెట్టి తీసేసారు. పైగా ఆ రోజుల్లో ఎన్టీఆర్ వద్దని చెప్పినా కృష్ణ వినలేదట. పట్టుబట్టి రిలీజ్ చేసారు. ఇక ఈ సినిమా పెట్టిన చిచ్చు వల్ల వారి మధ్య ఆరేళ్ళకు పైగా ఈ చిచ్చు రాజుకుంది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో అసలేం జరిగిందనే విషయం ఒక్కసారి చర్చిద్దాం..

స్టార్ హీరోల చేతులు మారిన అల్లూరి బయోపిక్..

అయితే కృష్ణ హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు బయోపిక్ తీద్దామని 50ల కాలంలోనే ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో చాలా మంది చేతులు మారి కృష్ణ వరకు వచ్చింది ఈ సినిమా. నిజానికి ఈ సినిమా చేద్దామని ముందుగా అనుకున్నది ఎన్టీ రామారావు. ఆయన 1955 లోనే అల్లూరి సీతారామరాజు బయోపిక్ తీద్దామని ఆ పాత్ర గెటప్ వేసుకుని కొన్ని ఫోటోషూట్స్ కూడా చేసారు. అయితే కొన్ని కారణాల చేత అది పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ప్రముఖ దర్శకులు కే.ఎస్ ప్రకాష్ రావు కూడా ఏఎన్ఆర్ తో ఈ బయోపిక్ తీద్దామనుకున్నారు. కానీ తాను ఆ పాత్రకు సరిపోనని ఏఎన్నార్ వద్దన్నారు. ఇక ప్రముఖ నిర్మాత డి.ఎల్ నారాయణ కూడా శోభన్ బాబు తో అల్లూరి బయోపిక్ కి ప్లాన్ చేసినా, కానీ బడ్జెట్ ఎక్కువవుతుంది వదిలేసారు. ఫైనల్ గా ఆ సినిమా సూపర్ స్టార్ కృష్ణ చేతికి వచ్చింది. అయితే అంతకుముందే 1968 లో వచ్చిన అసాధ్యుడు అనే చిత్రంలో కృష్ణ సీతారామరాజు పాత్రలో ఓ పాటలో కనిపించారు. బహుశా అప్పుడే ఆ పాత్ర కృష్ణ కోసమే నిర్ణయించబడిందేమో.. తిరిగి తిరిగి కృష్ణ చేతికి వచ్చింది. అందుకే కృష్ణే సినిమా తీయాలని సొంత నిర్మాణంలో పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో , వి.రామచంద్రరావు దర్శకుడిగా సినిమా మొదలెట్టారు.

ఎన్నో అవాంతరాలు.. ఎన్టీఆర్ చెప్పినా వినలేదు..

ఇక అల్లూరి సీతారామరాజు చిత్రం ఆరోజుల్లోనే నిర్మాణంలో ఉండగానే, ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నది. దాదాపు 38 రోజుల్లో విశాఖపట్టణ పరిసర ప్రాంత అడవుల్లో 25 లక్షల భారీ వ్యయంతో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు కూడా కృష్ణ కి ఈ పాత్ర చేయడం విరమించుకోమని పలువురు నిర్మాతలు సలహా ఇచ్చారు. ఇక స్వయంగా ఎన్టీఆర్ కలిసి ఈ పాత్ర తనకి సూట్ అవ్వదని అన్నారు. కానీ కృష్ణ ఇవేమి పట్టించుకొలేదు. చివరికి ఈ సినిమాలో కమెర్షియల్ ఎలిమెంట్స్ లేవని సినిమా కొనుక్కోవడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. ఫైనల్ గా తారకరామా ఫిలిమ్స్ వారికీ తక్కువ రేటుకి కొన్ని ఏరియాలని విక్రయించారు. ఇక ఈ సినిమా తీస్తుండగానే మధ్యలో డైరెక్టర్ చనిపోతే, మిగిలిన భాగాన్ని కృష్ణ కొంత భాగం, కే.ఎస్. ఆర్. దాస్ మరికొంత భాగం తెరకెక్కించారు. ఫైనల్ గా అన్ని అడ్డంకుల్ని దాటుకుని 1974 మే7న విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రం అఖండ విజయం సాధించింది.

- Advertisement -

సినిమా పెట్టిన చిచ్చు..

అయితే అల్లూరి సీతారామరాజు (50Years for Alluri Seetharama Raju) చిత్రం విడుదల తర్వాతే, అసలు గొడవ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా తియ్యాలనుకున్న ఎన్టీఆర్, ఈ సినిమా విడుదలైనప్పటినుండి కృష్ణ తో కొంచెం దూరంగా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు తీద్దామని అనుకున్నా కుదరకపోగా, వద్దని కృష్ణకి చెప్తే, పట్టించుకోకుండా సినిమా తీసి పెద్ద సక్సెస్ కొట్టడంతో ఎన్టీఆర్ కి మరింత కోపం వచ్చింది. ఎందుకంటే సినిమా ఆడకపోతే ఎన్టీఆర్ గెస్ కరెక్ట్ అయ్యేది. ఎన్టీఆర్ తనే హీరోగా మళ్ళీ తీసేవారు. కానీ అల్లూరి సీతారామరాజు ఊహించని అఖండ విజయం సాధించి, ఆ పాత్రలో కృష్ణని తప్ప మరెవర్నీ ఊహించుకోలేనట్టు చేసింది ఆ పాత్ర. ఇక అప్పటి నుండి కృష్ణ ఎన్టీఆర్ వైరం ముదిరింది. పలు కార్యక్రమాల్లో కలిసినా పెద్దగా మాట్లాడే వారు కాదు. అప్పటినుండి కృష్ణ చేసే చాలా సినిమాలకు ఎన్టీఆర్ సినిమాలు కావాలని పోటీగా రిలీజ్ చేసేటట్టు పరిస్థితి తయారయింది. ఇక ‘కురుక్షేత్రం’ చిత్ర సమయంలో పీక్స్ కి చేరింది. కృష్ణ కురుక్షేత్రం చిత్రంలో నటించేవారెవ్వరిని, ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ చిత్రంలో తీసుకోలేదు. ఆ తర్వాత కాలక్రమంలో ఇద్దరూ ఒకటైనా, కానీ మనసులో మాత్రం కృష్ణ ఎన్టీఆర్ మధ్య భేదాభిప్రాయాలు ఉండేవి. పలు సార్లు రాజకీయంగా ఇద్దరు పోటీపడిన సందర్భాలున్నాయి. ఓ దశలో ఈ వివాదం పీక్స్ కి చేరి ఎన్టీఆర్ కి కృష్ణ వ్యతిరేకంగా రాజకీయంగానూ సినిమాలు తీసే దాకా వెళ్ళింది. కానీ తర్వాత మళ్ళీ కలిసిపోయారు. రాజకీయంగా కొంచెం దూరంగానే ఉన్నా, వ్యక్తిగతంగా సొంత అన్నదమ్ముల్లా మెలిగేవారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ తీరని కల..

అయితే ఎన్టీఆర్ సీఎం అయ్యాక కూడా ఈ సినిమా తియ్యాలన్న కోరిక మాత్రం ఎన్టీఆర్ మనసులో గట్టిగా ఉండేది. అందుకే పలుమార్లు విరమించుకున్నా, చివరి ప్రయత్నంగా పరుచూరి బ్రదర్స్ ని సంప్రదించి స్క్రిప్ట్ రాయమన్నారు. అయితే అప్పుడు వారు ఎన్టీఆర్ ని ఒక్కసారి కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం ఒక్కసారి చూడమని చెప్పారు. ఆ సినిమా చుసిన తర్వాత కూడా తీద్దామంటే స్క్రిప్ట్ రాస్తామన్నారు. వెంటనే ఎన్టీఆర్ డైరెక్ట్ గా కృష్ణ నే పిలిపించుకుని, “బ్రదర్ మీ అల్లూరి బయోపిక్ సినిమా చూస్తానని చెప్పగా”, వెంటనే ఎన్టీఆర్ కోసం కృష్ణ స్పెషల్ స్క్రీనింగ్ వేయించారు. ఫైనల్ గా ఆ సినిమా చుసిన ఎన్టీఆర్.. కృష్ణ ని అభినందిస్తూ బ్రదర్ అల్లూరి సీతారామరాజు పాత్ర మీరు తప్ప ఎవరు చేయలేరు అంటూ ఆ సినిమా తీయాలనే ఆలోచనని విరమించుకున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో పరచూరి బ్రదర్స్ తెలియచేసారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు