Pushpa 2: ‘పుష్ప-2’ నుంచి మరో పోస్టర్

Pushpa 2: ఐకాన్ సార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే… ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ సినిమా కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప-2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న ‘పుష్ప – 2’ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించారు. ఇక ఇప్పుడు మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప-2 సినిమా కూడా రాబోతుంది. ఈ తరుణంలోనే.. ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్‌ వస్తున్నాయి.

అయితే… హీరో అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీ నుంచి మేకర్స్ మరో పోస్టర్ విడుదల చేశారు. ఎర్రచందనం దుంగల మధ్య నిలబడ్డ అల్లు అర్జున్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ మూవీ నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతున్నారు. ఇక ‘పుష్ప పుష్ప’ అంటూ సాగే పాట ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. ఈ సాంగ్ సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు