Modi on RRR: బహిరంగ సభలో RRR పై మోడీ ఏమన్నారంటే..?

Modi on RRR.. ఇండియన్ సినీ హిస్టరీలో ఓటమంటూ ఎరుగని అతి కొద్దిమంది డైరెక్టర్లలో ఎస్.ఎస్.రాజమౌళి కూడా ఒకరు.. ఇప్పటివరకు చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రతి సినిమాతో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుంటూ నేడు ప్రపంచస్థాయి గుర్తింపు సొంతం చేసుకున్నారు.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ మూవీగా ఆర్ఆర్ఆర్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది ..అంతేకాదు ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. పలు విభాగాలలో ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది ఈ చిత్రం.. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మారుమ్రోగిపోయింది. అంతేకాదు ఈ సినిమాలో నాటు నాటు పాట ఏ విధంగా ప్రేక్షకులను అలరించిందో అందరికీ తెలిసిందే . ఇందులోని సిగ్నేచర్ స్టెప్స్ ని పలువురు సెలబ్రిటీలు కూడా ఫాలో అవుతూ రీల్స్ ఇప్పటికీ చేస్తూ అలరిస్తూ ఉంటారు. ఇదిలా వుండగా.. తాజాగా ఈ సినిమాపై భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించడం గమనార్హం. అంతేకాదు బహిరంగ సభలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు..

Modi on RRR: What did Modi say on RRR in the public meeting..?
Modi on RRR: What did Modi say on RRR in the public meeting..?

ఆర్ ఆర్ ఆర్ పై మోదీ ప్రశంస..

మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో బిజెపి ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నారు.. ఈ సభలో ప్రధాని మోదీ సంచలన ఆరోపణలు చేసారు. ఇక అలాగే ఆయన మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ భారతదేశానికి ఆర్ఆర్ఆర్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించింది.. కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఆర్ఆర్ పన్ను విధించింది..ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి కీర్తిని తీసుకొస్తే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆర్ఆర్ పన్ను విధించి మరింత ఇబ్బందిని కలిగిస్తోంది.

తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు..

తెలంగాణలో కాంట్రాక్టర్లు , పారిశ్రామికవేత్తలు ఇక్కడ వసూలు చేసిన మొత్తం నల్లధనంలో కొంత భాగాన్ని ఆర్ఆర్ పన్ను రూపంలో ఢిల్లీకి చెల్లించాలని.. ఈ ఆర్ ఆర్ పన్ను గురించి తెలంగాణలో ప్రతి చోట చర్చ జరుగుతుందేమో అంటూ కామెంట్ చేశారు.. ఆర్ ఆర్ అంటే ఎవరు మీకు ఇప్పటికే అర్థమైంది కదా అంటూ సభలోని ప్రజలను మోదీ అడగడంతో పెద్ద ఎత్తున స్పందన లభించింది.. ఈ ఆర్ ఆర్ టాక్స్ ను అడ్డుకోకపోతే సర్వనాశనం అవుతుందని.. ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ నాశనం చేయగా.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోందని ఎద్దేవా చేశారు. అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా ఒకే గూటి పక్షులని.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారని మోదీ గుర్తు చేశారు.. గతంలో ఓటుకు నోటు కేసును బీఆర్ఎస్ తొక్కి పెట్టిందని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేస్తామని హడావిడి చేసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు దాన్ని పక్కన పడేశారు అంటూ విమర్శించారు. మొత్తానికైతే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే పనిలో పడ్డారు అంటూ ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యానించారు మొత్తానికి అయితే ఈయన అటు రేవంత్ రెడ్డివిమర్శిస్తూనే ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు