Makarand Deshpande on RRR : ఆర్ఆర్ఆర్ కోసం అంత కష్టపడ్డా ఫలితం లేకుండా పోయింది… ఏక్ నిరంజన్ నటుడి కామెంట్స్

Makarand Deshpande on RRR : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అందులో నటించిన నటీనటులు గ్లోబల్ స్థాయిలో మంచి పాపులారిటీని దక్కించుకున్నారు. కానీ ఈ సినిమాలో నటించినప్పటికీ తెరపై కనిపించే అవకాశాన్ని చేజార్చుకున్నారు బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్ పాండే. తాజాగా ఆయన ఇంతటి మ్యాగ్నం ఓపస్ మూవీలో నటించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ట్రిపుల్ ఆర్ లో మకరంద్ సీన్స్ కట్…

మకరంద్ దేశ్ పాండే… ఈ పేరు వింటే ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలీదు గానీ ఏక్ నిరంజన్ సినిమాలో పెద్ద జుట్టు గడ్డం వేసుకొని హీరోతో పట్టే ఉండే సీనియర్ నటుడు అంటే అందరికీ వెంటనే గుర్తొస్తుంది. ఆయనే ట్రిపుల్ ఆర్ మూవీలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించారు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమాలో ఈయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను కట్ చేశారు మేకర్స్. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మకరంద్ దేశ్ పాండే మాట్లాడుతూ ఇలాంటి మమ్మత్ ఫిలింపై చాలా కారణాల వల్ల షెడ్యూల్స్ పై ఎఫెక్ట్ పడిందని గుర్తు చేసుకున్నారు. కోవిడ్, వర్షాలు వంటి కారణాల వల్ల అప్పట్లో షూటింగ్ డిఫికల్ట్ గా మారిందని వెల్లడించారు. అయితే మొదట్లో సినిమా షూటింగ్ లో తాను చాలా టైమ్ స్పెండ్ చేశానని, కానీ ఆ తర్వాత వివిధ కారణాలతో షెడ్యూల్స్ మారుతూ, ముందుకు సాగడం వల్ల తనకు ఈ సినిమాకు డేట్స్ కేటాయించడం కష్టంగా మారిందని చెప్పుకొచ్చారు. అప్పటికే డేట్స్ ఇష్యూ కారణంగా తాను సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నటించాచే ఛాన్స్ కోల్పోయానని, లేదంటే త్రిబుల్ ఆర్ సినిమాలో తన స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉండేదని వెల్లడించారు.

ఇక యాక్టర్ అనేవాడు కేవలం తన పనిని మాత్రమే చేయగలడని, ఏది ఎడిటింగ్ లో పోతుందో దానికి ఏం చేయలేము అంటూ చెప్పుకొచ్చారు మకరంద్.

- Advertisement -

మకరంద్ రోల్ ఇదే..

ట్రిపుల్ ఆర్ సినిమాలో మకరంద్ దేశ్ పాండే గిరిజన ప్రాంతానికి చెందిన ముఖ్యమైన వ్యక్తిగా కనిపించాల్సి ఉంది. కొంతకాలం షూటింగ్ జరిగిన తర్వాత డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే ముందుగా ఈ సినిమాలో అతన్ని సెలెక్ట్ చేయగానే మకరంద్ దేశ్ పాండే ఎప్పటిలా భారీ జుట్టు, మీసాలతో కాకుండా నీట్ గా షేవింగ్ చేసుకొని వచ్చి రాజమౌళికి షాక్ ఇచ్చారట. నిజానికి ఆయనకు ఉన్న ఆ జుట్టు కారణంగానే అతన్ని సినిమాలోకి తీసుకోవాలనుకున్నారు రాజమౌళి. ఏదైతేనే మొత్తానికి మేకప్ ద్వారా దాన్ని కవర్ చేద్దామని అనుకున్నారు. కానీ చివరకు పరిస్థితుల కారణంగా అసలు ఆయన పాత్రే సినిమాలో కనిపించకుండా పోయింది.

మంకీ మాన్ రిలీజ్ పై క్లారిటీ..

కాగా రీసెంట్ గా అమెరికాలో రిలీజ్ అయిన మంకీ మాన్ మూవీలో మకరంద్ కీలకపాత్రలో నటించాడు. ఈ మూవీని త్వరలోనే ఇండియాలో కూడా రిలీజ్ చేస్తారని ఈ సందర్భంగా ఈ సీనియర్ నటుడు వెల్లడించారు. ప్రస్తుతం ఇండియాలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న కారణంగా మూవీ రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని, మంకీ మాన్ మూవీలో అభ్యంతర సన్నివేశాలు ఏమీ లేవని క్లారిటీ ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు