HBD Ajith : అజిత్ కి ఇష్టమైన బైక్ ను బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చిన వైఫ్

HBD Ajith : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈరోజు తన 53వ పుట్టినరోజు ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా, ఆయన భార్య, ఒకప్పటి హీరోయిన్ శాలిని అజిత్ కుమార్ ఈ హీరోకు పుట్టినరోజు నాడు ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చింది. అజిత్ కి ఇష్టమైన బైక్ నే ఆమె గిఫ్ట్ గా ఇవ్వడంతో దానికి సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మరి ఆ బైక్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అజిత్ కు శాలిని స్పెషల్ గిఫ్ట్

అజిత్ కుమార్ 53వ పుట్టినరోజును ఆయన భార్య మరింత ప్రత్యేకంగా చేసింది. అజిత్ కు బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టమైనే విషయం ఆయన అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల కాలంలో అజిత్ బైక్ పైనే విహారయాత్రలు చేస్తూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. ఇక తాజాగా అజిత్ పుట్టిన రోజున ఈ ఆదర్శ దంపతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అజిత్ కి 30 లక్షల విలువైన డుకాటి బైక్ ను శాలిని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసింది.

డుకాటి బైక్ విశేషాలు..

ఈ బైక్ కంపెనీ ఇండియాలో అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తయినప్పటికీ చెన్నైకి మాత్రం కొత్త అని చెప్పొచ్చు. బైక్ రేసింగ్ లలో ఉపయోగించే బైక్ లలో డుకాటి ముఖ్యమైన రకమైనదని చెప్పొచ్చు. దీనికి ఎయిర్ బ్యాగులు కూడా ఉంటాయి. బైకర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ బైక్ కంపెనీ డుకాటి బైక్ లో చాలా వరకు సాంకేతికతను యాడ్ చేసింది. ఈ బైక్ బరువు 1093.5 కిలోలు. పొడవు 1180mm, వెడల్పు 2105mm. బైక్ సీట్ ఎత్తు 859 mm. ఇక త్వరలోనే అజిత్ ఈ బైక్ ను నడుపుతున్న వీడియోలు వైరల్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా శాలిని ఈ బైక్ ను అజిత్ కి గిఫ్ట్ గా ఇచ్చిన నేపథ్యంలో చెన్నైలో డుకాటి బైక్ సేల్స్ బాగా పెరిగిపోయే ఛాన్స్ ఉంది.

- Advertisement -

శాలిని, అజిత్ లవ్ మ్యారేజ్

అజిత్, శాలిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అమర్ కలం అనే సినిమాలో వీరిద్దరి లవ్ స్టోరీ మొదలైంది. 1999లో మొదలైన వీళ్ళ లవ్ స్టోరీ దాదాపు ఏడాది పాటు సాగగా, 2000 ఏప్రిల్ 24న ఈ జంట పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత శాలిని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు అనౌష్క, ఆధిక్. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ అందమైన కపుల్ ప్రేమగా ఉంటూ ఆదర్శ జంటగా నిలిచారు. రీసెంట్ గానే సంతోషంగా తమ 24వ పెళ్లిరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు అజిత్ శాలిని.

అజిత్ సినిమాలు

ప్రస్తుతం అజిత్ విడా మూయార్చీ, గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమాల్లో నటిస్తున్నారు.  ఇప్పటికే విడా మూయార్చీ షూటింగ్ చాలా వరకు పూర్తి కాగా, త్వరలోనే గుడ్ బాడ్ అగ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు