Mayday special songs : కార్మికుల చెమట కష్టాన్ని తెలియచేసే పాటలు..!

Mayday special songs : ప్రపంచ దేశాలు మొత్తం జరుపుకునే పండగల్లో ‘మేడే’ ఒకటి. శ్రమజీవులెందరో అలుపెరుగని పోరాటంతో తమ హక్కులు సాధించుకున్న కార్మికుల రోజే ఈ “మేడే”. ఒక మనిషికి రోజుకి 8 గంటలు మాత్రమే పని ఉండాలనే ఉద్దేశ్యంతో అమెరికాలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం ప్రపంచదేశాల్లో అన్నిటా విస్తరించి విజయం సాధించింది. భారతదేశంలో 1923లో ఈ ఉద్యమం లో విజయం సాధించారు కార్మిక సోదరులు. ఇక సమాజ నిర్మాణంలో కీలకమైన ఈ కార్మికుల కథాంశంతో తెలుగులోనూ ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. ఇక పలు కమర్షియల్ సినిమాల్లోనూ కార్మిక, కర్షకుల కోసం వీరి పాత్రలకు తగ్గట్లు పాటల రచయితలు వాళ్ల తరపున కలం ఎత్తితే, గాయకులు బలంగా గళం వినిపించారు. ఇక ఆ రోజుల్లో వచ్చిన అలాంటి గొప్ప పాటలని కొన్ని మేడే సందర్బంగా ఓ సారి గుర్తు చేసుకుందాం.

ఎర్రమల్లెలు (1981) : నేడే మేడే..

అన్యాయం.. అక్రమాలు.. దోపిడీలు.. దురంతాలు.. ఎన్నాళ్లని ఎన్నేళ్లని నిలదీసినదీరోజే మేడే..’ అంటూ కార్మిక దినోత్సవానికి సిసలైన అర్థం చెబుతూ సాగుతుంది ‘ఎర్రమల్లెలు’ చిత్రంలో పాట.

నిప్పురవ్వ (1993) : కదిలి రండి..

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ చిత్రంలో ‘రండి కదలి రండి.. నిదుర లెండి.. కలసి రండి…’ అంటూ సాగే పాటలో బాలయ్య పాడగా, సింగరేణి కార్మికుడిగా ఈ చిత్రంలో నటించారు.

- Advertisement -

ఈనాడు (1982) : రండి.. కదలిరండి..

సూపర్ కృష్ణ హీరోగా నటించిన ఈనాడు చిత్రంలో కార్మికుడిగా నటించగా, ఆ చిత్రంలో రండి కదిలి రండి అంటూ కార్మికులు ఉద్యమం చేసే పాట ఆ రోజులు సంచలనం సృష్టించగా, ఎన్టీఆర్ తెలుగుదేశానికి మద్దతిస్తూ ఆయనకోసమే కృష్ణ తీసిన సినిమా ఇది.

ఎర్ర సైన్యం (1994) : బంజారే బంజా..

ఇక విప్లవాత్మక చిత్రాలకు, కార్మిక కర్షకుల నేపథ్యంలో వచ్చే చిత్రాలకు కేరాఫ్ గా నిలిచే ఆర్. నారాయణమూర్తి ప్రతి చిత్రాల్లో ఇలాంటి పాటలు ఉంటాయి. ఇక ఆయన దర్శకత్వం వహించిన ‘ఎర్ర సైన్యం’ లో ‘బంజారే బంజో.. వోనారే బంజా…’ ఆరోజుల్లో ఊపు ఊపింది.

చీమల దండు (1995) : ఎర్ర జెండా..

ఇక మే డే రోజు ప్రతి పల్లెలో కామన్ గా వినే పాపులర్ పాట ఇది. ‘చీమలదండు’ చిత్రంలో ‘ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నీయెళ్లో.. ఎర్రెర్రనిదీ జెండెన్నీయల్లో’… ఏంటో అప్పట్లో ప్రతి పల్లెని కదిలించింది. అలాగే సింగన్న చిత్రంలో .. ‘ఆయారే మేడే.. ఆయుధమై నేడే..’ అంటూ హోరెత్తిన పాటలు కూడా ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించాయి.

కుబుసం (2002) : పల్లె కన్నీరు పెడుతుందో..

శ్రీహరి హీరోగా నటించిన విప్లవాత్మక చిత్రం కుబుసంలో పల్లె కన్నీరు పెడుతుందో అంటూ రాసిన పాట ప్రతి పల్లెటూళ్లలో ఆధునికత వల్ల చేతి వృత్తుల వారిపనిపోతుందని ఎంతో భావోద్వేగంతో సాగే పాట ఇది.

ఇక ఆరోజుల్లో ఇలాంటి పాటలతో (Mayday special songs) కూడా ప్రత్యేకంగా గేయ రచయితలు ఫేమస్ అయ్యారు. తోటితరం రోజుల్లో శ్రీశ్రీ, ఆరుద్ర, సినారే వంటి వారు ఇలాంటి పాటలు రాయగా, ఆ తర్వాత ఈ తరంలో వరకు సుద్దాల అశోక్ తేజ, వందేమాతరం శ్రీనివాస్, చంద్రబోస్, గోరెటి వెంకన్న వంటి రచయితలు ఇలాంటి పాటలు రాయడంలో సిద్ధహస్తులయ్యారు.

.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు