Premalu2 : మలయాళ బ్లాక్ బస్టర్ సీక్వెల్ కి రెడీ?

Premalu2 : టాలీవుడ్ లో రీసెంట్ గా మలయాళ మూవీస్ రిలీజ్ అయి తెలుగులో ఏ రేంజ్ లో ఆడుతున్నాయో తెలిసిందే. ముఖ్యంగా అందులో చిన్న సినిమాగా తెరకెక్కిన సినిమా ప్రేమలు మలయాళంలో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలవగా, తెలుగులో కూడా రిలీజ్ అయి అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూపర్ హిట్ మూవీ ప్రేమలు లో నస్లెన్ కే గఫూర్, మమితా బైజు హీరో, హీరోయిన్లు గా నటించగా, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. తెలుగులోనూ భారీ వసూళ్ళు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీస్ ప్రేమలు సినిమా ఈ ఏడాది ఏకంగా 135 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా దాదాపు 15 కోట్లకుపైగా వచ్చాయి. ఇక ఈ మూవీ సీక్వెల్ తీయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రేమలు 2 పేరుతో ఈ సినిమా రానుండగా ట్విట్టర్ ద్వారా మూవీ సీక్వెల్, టైటిల్ ను రివీల్ చేశారు.

సీక్వెల్ కి కూడా సేమ్ క్యాస్ట్?

అయితే తాజాగా మలయాళం సినిమాలో ఈ మధ్య కాలంలో రానంత రేంజ్ లో అతిపెద్ద రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ గా ప్రేమలు నిలవగా, దానికి సీక్వెల్ మూవీ 2025లో మళ్లీ వస్తోంది. ప్రేమలు 2 సినిమా కూడా మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి ఈ భాషల్లో కూడా విడుదల అవుతుందని చెప్పేసారు. ఇక ఈ సీక్వెల్ కు కూడా గిరీష్ ఏడీ దర్శకత్వం వహించనున్నాడు. తమ క్యూట్ లవ్ స్టోరీతో మరోసారి అలరించడానికి నస్లెన్, మమితా బైజు మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక ప్రేమలు మూవీని హీరో సచిన్ యూకే వెళ్తున్న సీన్ తో ముగించారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దామని చెప్పి అతనికి నుదిటిపై ముద్దు పెట్టి వెళ్లిపోతుంది హీరోయిన్. దీంతో సీక్వెల్లో వీళ్ల లవ్ స్టోరీ ఎలా ముందుకు సాగుతుందో అన్న ఆసక్తి నెలకొంది. ఇక అన్ని సౌత్ భాషల్లోనూ రానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

సీక్వెల్ కూడా కార్తికేయ చేతుల్లోనే?

ఇక ప్రేమలు లాంటి ఎవ‌ర్‌గ్రీన్ కాన్సెప్ట్‌ లను ఎంతో మంది ద‌ర్శ‌కులు ఎన్నో ర‌కాలుగా తెర‌కెక్కించారు. ప్రేమ‌లు కూడా అలాంటి రొటీన్ ల‌వ్‌స్టోరీనే. కానీ దర్శకుడి స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఎదో మాయ చేసింది.
ఇక ఈ సినిమాలో నేటి అమ్మాయిలు, అబ్బాయిల మ‌ధ్య స్నేహాలు, స‌ర‌దాల‌ను చాలా క్లీన్‌గా ఎలాంటి వ‌ల్గారిటీ లేకుండా చూపించాడు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈ సినిమా చూడ్డానికి ఆసక్తి చూపించారు. ఇక ఈ సినిమాకు మిమితా బైజు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. రీనూ పాత్ర‌లో త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌, నాచుర‌ల్ ప‌ర్ఫార్మెన్స్‌తో ఫిదా చేసింది. స‌చిన్ పాత్ర‌లో న‌స్లేన్ కూడా ఆక‌ట్టుకున్నాడు. స‌గ‌టు కుర్రాడి పాత్ర‌కు ప‌ర్‌ఫెక్ట్‌గా స‌రిపోయాడు. ఇక ఈ సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడు కార్తికేయ తీసుకొచ్చాడు. ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ డబ్బింగ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ప్రేమలు 2 (Premalu2) మూవీని కూడా కార్తికేయనే తీసుకురానున్నాడు. మరి ప్రేమలు 2 వచ్చేటప్పటికి తెలుగులో ఏ రేంజ్ బిజినెస్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు