Premalu OTT : మలయాళం బ్లాక్ బస్టర్ ఓటిటి స్ట్రీమింగ్ లాక్..

Premalu OTT : టాలీవుడ్ లో మూడు వారాల కింద రిలీజ్ అయిన మలయాళ బ్లాక్ బస్టర్ ‘ప్రేమలు’ తెలుగులో ఏ స్థాయిలో థియేటర్లలో ఆడుతుందో తెలిసిందే. తెలుగు సినిమాలతో పోటీగా రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా బడా మూవీలకు ధీటుగా అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మలయాళం సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో ముందు నుండి క్రేజీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ రెండు నెలల క్రితమే మలయాళం లో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి కల్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా మూడు వారాల తెలుగులో మార్చి 8న రిలీజ్ అయింది. ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు కార్తికేయ స్వయంగా ఈ సినిమాని తెలుగు రైట్స్ ని కొనుక్కుని రిలీజ్ చేయడం విశేషం. ఇక రిలీజ్ అయిన మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో పలు తెలుగు సినిమాల పోటీ వల్ల యావరేజ్ గా ఆడినప్పటికి బ్రేక్ ఈవెన్ అయింది. ఇక రెండో వారంలోనే ఊచకోత స్టార్ట్ అయింది. పైగా రెండో వీకెండ్ లో థియేటర్ల సంఖ్య కూడా పెరిగి కలెక్షన్లు పుంజుకున్నాయి. దాదాపు తెలుగులో బయ్యర్లకి 5 కోట్ల వరకు లాభాలను అందించడం విశేషం.

ప్రేమలు లాభాల పంట..

ఇక మలయాళం సినిమా ప్రేమలు ఇప్పటివరకు దాదాపు 130 కోట్ల వరకు గ్రాస్ వసూళ్ళని అందుకుంది అంచనా. అయితే ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మలయాళం రిలీజ్ అయినప్పుడే తెలుగులో కూడా ప్రేమలు రిలీజ్ అయి ఉంటే ఇక్కడ మరింత ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసే ఛాన్స్ ఉండేదని అన్నారు. ఇక టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన డబ్బింగ్ సినిమాగా ప్రేమలు రికార్డు సృష్టించింది. తెలుగులో రిలీజ్ చేసిన కార్తికేయ కి దాదాపు ఈ సినిమాతో 4 కోట్ల వరకు లాభం వచ్చిందని టాక్. ఇదిలా ఉండగా ప్రేమలు సినిమా ఓటిటి రిలీజ్ ( Premalu OTT )డేట్ కూడా లాక్ అయింది. ఈ సినిమాను థియేటర్లలో ఆల్రెడీ వీక్షించిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటిటి లోనూ చూడ్డానికి మరింత ఆసక్తి చూపుతున్నారు.

ఆరోజే ఓటిటి రిలీజ్!

సౌత్ ఇండియా వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ప్రేమలు సినిమా ఇప్పుడు ఓటిటి లో కూడా ట్రెండ్ క్రియేట్ చేసేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన హాట్ స్టార్ లో ప్రేమలు సినిమా ఏప్రిల్ 12నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ప్రేమలు ఇప్పటికి కూడా కేరళ, అలాగే తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో రన్ అవుతుండడం విశేషం. అయితే ప్రేమలు కన్నడ, హిందీలో మాత్రం ఇంకా అందుబాటులోకి రావడం లేదని సమాచారం. కానీ త్వరలోనే ఆ భాషల్లో కూడా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వస్తుందట. మరి థియేటర్లలో రచ్చ రచ్చ చేసిన ప్రేమలు ఓటిటి లో ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు