Premalu Telugu Movie : ఫైనల్ గా టాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా టాప్ పొజిషన్..

Premalu Telugu Movie : టాలీవుడ్ లో రెండు వారాల కింద రిలీజ్ అయిన ప్రేమలు స్థాయిలో థియేటర్లలో ఆడుతుందో తెలిసిందే. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మలయాళం సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో ముందు నుండి అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ నెలన్నర క్రితమే మలయాళం లో ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా రెండు వారాల తెలుగులో మార్చి 8న రిలీజ్ అయింది. ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు కార్తికేయ స్వయంగా ఈ సినిమాని తెలుగు రైట్స్ ని కొనుక్కుని రిలీజ్ చేయడం విశేషం. ఇక రిలీజ్ అయిన మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాల పోటీ వల్ల యావరేజ్ గా ఆడినప్పటికి బ్రేక్ ఈవెన్ అయింది. కానీ రెండో వారంలో ఊచకోత స్టార్ట్ అయింది. పైగా రెండో వీకెండ్ వచ్చేసరికి థియేటర్ల సంఖ్య పెరిగి కలెక్షన్లు పుంజుకున్నాయి.

ఇక మలయాళం సినిమా ప్రేమలు అక్కడ ఆల్రెడీ 100 కోట్ల వసూళ్లు దాటగా తెలుగు వెర్షన్ తో కలిపి 120 కోట్ల మార్క్ ని దాటేసింది. అయితే ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మలయాళం రిలీజ్ అయినప్పుడే తెలుగులో కూడా ప్రేమలు రిలీజ్ అయి ఉంటే ఇక్కడ మరింత ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసే ఛాన్స్ ఉండేదని భావించారు. ఇకపోతే లాంగ్ రన్ లో మాత్రం ప్రేమలు తెలుగులో భీభత్సమైన కలెక్షన్లు సాధించిందని చెప్పాలి. అయితే తెలుగులో నెమ్మదిగా పుంజుకున్నా కూడా ప్రేమలు తెలుగు వెర్షన్ భారీ వసూళ్లతో ఏకంగా హైయెస్ట్ వసూళ్లు సాధించిన మలయాళం సినిమాగా టాప్ ప్లేస్ లోకి ఎంటర్ అయింది. తెలుగు సినిమాల పోటీలో కూడా ఈ ఫీట్ సాధించడం విశేషం.

ఇక తెలుగులో మలయాళం సినిమాల్లో అప్పుడెప్పుడో వచ్చిన మోహన్ లాల్ సినిమా మన్యం పులి తెలుగు వెర్షన్ దాదాపు 9.50 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇక ఆ రోజుల్లో ఇండస్ట్రీ హిట్ అయిన ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు అందుకుంది. ఆ తర్వాత దీన్ని లాస్ట్ ఇయర్ 2018 సినిమా సడన్ గా రిలీజ్ అయి అనూహ్యంగా 10. 85 కోట్ల వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ప్రేమలు రిలీజ్ అయి 11.75 కోట్ల వసూళ్లు తెలుగులో సాధించి హైయెస్ట్ వసూళ్లు సాధించిన మలయాళం సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే ఏప్రిల్ లో తెలుగులో రిలీజ్ అవ్వబోతున్న మంజుమ్మేల్ బాయ్స్ సినిమాకి తెలుగులో ఈ రికార్డు బ్రేక్ చేయడానికి ఎంతో స్కోప్ ఉందని చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇంకా ప్రకటించలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు