Sukumar : శిష్యుడు కోసమే ఆ విషయాన్ని దాచి ఉంచారు

Sukumar : కొన్ని కాంబినేషన్లో సినిమాలు సెట్ అయినప్పుడు వాటిపైన పెద్దగా ఎక్స్పెక్టేషన్ కూడా ఉండవు. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ని బట్టి వావ్ అనే ఫీల్ కూడా కొన్నిసార్లు క్రియేట్ అవుతుంది. అలా జరిగిన సినిమా రంగస్థలం. అప్పటివరకు క్లాస్ ఫిలిమ్స్ తీసిన దర్శకుడు సుకుమార్. సుకుమార్ సినిమాల్లో హీరోలు ఎంత ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తారు. అప్పటికే చాలా సినిమాల ద్వారా ప్రూవ్ చేస్తూ వచ్చాడు. ఇకపోతే రామ్ చరణ్ సుకుమార్ సినిమా చేస్తున్నారు అని అనౌన్స్ చేసినప్పుడు ఎవరికి పెద్దగా ఎక్స్పెక్టేషన్ అంటూ లేవు.

వారి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పుడు ఒక సూపర్ హిట్ సినిమా అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది రామ్ చరణ్ కు కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అయిపోయింది. సుకుమార్లో సరికొత్త కోణాన్ని బయటకు తీసింది. ఓవరాల్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే చాలా ఏళ్ల క్రితం రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెబుతూ “ఒక కంప్లీట్ యాక్షన్ ఫిలిం తీస్తే మేము సర్దుకోవాల్సిందే అని నేను ఫీలయ్యే డైరెక్టర్లు ఇద్దరు ఒకటి సుకుమార్ రెండు త్రివిక్రమ్ శ్రీనివాస్” అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే వీరిద్దరూ కూడా అలాంటి మాస్ కమర్షియల్ ఫిలిమ్స్ ను తీశారు. నాన్నకు ప్రేమతో వంటి ఒక క్లాస్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా రంగస్థలం. సుకుమార్ లోని ఇటువంటి దర్శకుడు కూడా ఉన్నాడు అని ప్రూవ్ చేసి సుకుమార్ అసలైన టాలెంట్ ఏంటి అని తెలుగు ఆడియన్స్ కి తెలిసి వచ్చేలా చేసింది రంగస్థలం. ఆ సినిమాలో చరణ్ చూపించిన విధానం. హీరోకి ఒక లోపాన్ని పెట్టి జనాల్ని ఎంటర్టైన్ చేసి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సుక్కు. అయితే రంగస్థలం సినిమాలో కూడా రామ్ చరణ్ ఇంటెలిజెంట్ గా కనిపిస్తాడు.

- Advertisement -

ఇకపోతే అజ్ఞాతవాసి సినిమా తర్వాత త్రివిక్రమ్ చేసిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమాకు సంబంధించిన మొదటి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఇది ఒక బోయపాటి ఫిలింలా చాలామంది ఫీల్ అయ్యారు. అయితే అదే ఏడాదిలో రిలీజ్ అయిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీస్ వద్ద బీభత్సమైన విజయాన్ని సాధించింది. మొదటి 20 నిమిషాల తోనే అరాచకానికి అర్థం ఏంటో చూపించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇలా రాజమౌళి ఇచ్చిన స్టేట్మెంట్ తో ఇద్దరి దర్శకులు కూడా ప్రూవ్ చేసుకున్నారు.

అయితే ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ఎప్పుడు ఒక విషయాన్ని చెప్తూ వచ్చేవాడు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఎంట్రీ సీన్ నాకు బాగా తెలుసు. ఆ సీన్ గురించి నేను క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. అయితే సుకుమార్ మళ్లీ రామ్ చరణ్ తో సినిమా చేస్తాడు అని ఇన్ డైరెక్ట్ గా అప్పుడే చెప్పుకొచ్చాడు జక్కన్న.

ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. అయితే ఈ సినిమాను ఇప్పుడు అనౌన్స్ చేయడం వెనక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. రీసెంట్ గా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా రీసెంట్ గానే జరిగాయి. నేడు సుకుమార్ ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ముందు ఈ ప్రాజెక్టు ని అనౌన్స్ చేయాల్సి ఉంది. కానీ ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన తర్వాత తన శిష్యుడు బుచ్చిబాబు సినిమా ప్రాజెక్టుని అనౌన్స్ చేస్తే పెద్దగా రీచ్ అవ్వదు. అందుకని బుచ్చిబాబుతో చరణ్ ప్రాజెక్టును అనౌన్స్ చేసి ఆ తర్వాత ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు