Rajamouli: ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డ రాజమౌళి ఫ్యామిలీ..!!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు సినీ ప్రఖ్యాతను వివిధ దేశాలకు చాటిచెప్పిన డైరెక్టర్ గా పేరు సంపాదించారు.. ముఖ్యంగా రాజమౌళి తన కుటుంబంతో కలిసి ఎప్పుడూ వెకేషన్ కు వెళ్తూ ఉంటారు.. ఇప్పుడు తాజాగా జపాన్ లో వెకేషన్ కి వెళ్ళారు రాజమౌళి కుటుంబం.. అక్కడ ఆయన తెరకెక్కించిన RRR సినిమా థియేటర్లో ఏడాదిన్నరకుపైగా ఆడుతూ ఉండడంతో రాజమౌళి కుటుంబం మొత్తం స్పెషల్స్ స్క్రీనింగ్ కోసం అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తున్నది.. ఇప్పుడు తాజాగా అక్కడ స్వల్పంగా భూకంపం రావడంతో రాజమౌళి అభిమానులు సైతం ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు.

త్రుటిలో తప్పించుకున్న రాజమౌళి కుటుంబం..

అయితే రాజమౌళి కుటుంబం ఆ భూకంపం నుంచి తప్పించుకున్నట్లుగా ట్విట్టర్ ఖాతా ద్వారా రాజమౌళి కుమారుడు కార్తికేయ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. జపాన్ లో ఒక పెద్ద బిల్డింగ్ లోని 28వ ఫ్లోర్ లో మేమంతా ఉన్నాము.. సరిగ్గా ఆ సమయంలోనే బిల్డింగ్ కదులుతున్న ఫీలింగ్ అనిపించింది.. అయితే కొద్దిసేపటికి ఇది భూకంపం అని తెలిసి కాస్త ఆందోళన చెందాము. కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఏదో వర్షం పడుతుందన్నట్లుగా చాలా కూల్ గా ఉన్నారు.. మొత్తానికైతే ఈ భూకంపం నుంచి ఎలాగోల బయటపడ్డాం.. కానీ ఈ భూకంపం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేశామంటూ కార్తికేయ తెలియజేశారు.

- Advertisement -

భూకంపం గురించి వార్నింగ్ ఇచ్చిన స్మార్ట్ వాచ్..

భూకంపం సమయంలో తమ స్మార్ట్ వాచ్ లు ఇచ్చిన వార్నింగ్ ను కూడా ఒక ఫోటో తీసి ట్విట్టర్లో షేర్ చేశారు.అయితే భూకంపం రావడం చూసి కాస్త ఆందోళన పడ్డారు రాజమౌళి ఫ్యామిలీ.. కానీ జపాన్ ప్రజలు మాత్రం వారికి ధైర్యం చెబుతూ.. ఇక్కడ భూకంపం రావడం చాలా సాధారణమే అని.. ఇది భారీ భూకంపం కాదని కూల్ గా చెప్పారట.. దీంతో వారు కూడా ఊపిరి పీల్చుకున్నట్లు సమాచారం. ఇక ఇక్కడ కార్తికేయ షేర్ చేసిన ఈ పోస్ట్ చూసి అభిమానులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. అంతేకాదు పలువురు అభిమానులు సైతం రాజమౌళి కుటుంబం సేఫ్గా ఇండియాకి వచ్చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

భూకంపం వివరాలు..

అయితే జపాన్ లో వచ్చిన ఈ తాజా భూకంపం తీవ్రత..5.3 గా నమోదయింది. తూర్పు జపాన్ లో దక్షిణ ఇబారాలకి 46 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా అక్కడ నిపుణులు తెలుపుతున్నారు
జపాన్లో రాజమౌళి కుటుంబం అడుగుపెట్టినప్పటి నుంచి అక్కడ జపనీయులు అద్భుతమైన ఆతిధ్యం రాజమౌళి కుటుంబానికి ఇచ్చారు. రాజమౌళిని చూసేందుకు అక్కడ జపాన్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఎయిర్పోర్టుకి రావడంతో పాటు ఒక పెద్దావిడ రాజమౌళి కోసం స్పెషల్ గిఫ్ట్ ను కూడా తయారు చేసింది.. ఈ వీడియోను కూడా రాజమౌళి ఇటీవల షేర్ చేశారు.రాజమౌళి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి పాన్ వరల్డ్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు