Rajamouli: అతని పేరు మహేష్ బాబు, రిలీజ్ టైం కి ఇక్కడకి తీసుకొస్తా

సూపర్ స్టార్ మహేష్ బాబు, తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి చాలా చిన్నలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు మహేష్ బాబు. తర్వాత కాలంలో మహేష్ బాబు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వరుస సినిమాలను చేస్తున్న మహేష్ కి మురారి సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత మహేష్ చేసిన కొన్ని సినిమాలు ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఒక్కడు సాధించిన ఘన విజయాన్ని మాటల్లో చెప్పలేం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చిన సినిమా ఒక్కడు. అక్కడితో మహేష్ బాబు రేంజ్ మారిపోయింది అని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత అతడు, అర్జున్, పోకిరి సినిమాలు మహేష్ కి ఒక మాస్ కమర్షియల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చి పెట్టాయి. ఇకపోతే మహేష్ కి ఫ్యామిలీ ఆడియోన్స్ ఎప్పటి నుంచో ఉంది.

ఇక రీసెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా మిశ్రమ స్పందనను అందుకున్న కూడా ఆ సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చిందంటే కారణం ఆ సినిమాకి ఉన్న ఫ్యామిలీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పెట్టారు. దాదాపు నెగిటివ్ టాక్ తో బయటకు వచ్చిన ఈ సినిమా కొంచెం పాజిటివ్ కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీలో నిలబడింది.

- Advertisement -

ఇక మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరడుగుల అందం అంతులేని టాలెంట్ ఉన్న నటుడు మహేష్ బాబు. మామూలుగా మహేష్ బాబు చూడడానికి హాలీవుడ్ కట్ అవుట్ లా అనిపిస్తాడు. ఇకపోతే మహేష్ తన కెరియర్లో ఎన్నో ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ ను చేశాడు. అయితే కొన్ని సినిమాలు హిట్ అయితే ఇంకొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ హీరోగా మహేష్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పొచ్చు.

ఇకపోతే మహేష్ ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్ పైన అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నది రాజమౌళి దర్శకత్వంలో కాబట్టి. రాజమౌళి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళిది.

అయితే ఇప్పటివరకు రాజమౌళి చాలామంది హీరోలను స్టార్లను చేశాడు. అల్లు అర్జున్ మినహాయిస్తే ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళందరికీ స్టార్ డం తీసుకొచ్చింది మాత్రం రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు. ఆల్రెడీ స్టార్ డం ఉన్న మహేష్ బాబు తో రాజమౌళి ఇప్పుడు సినిమా చేస్తుండడం పై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక రీసెంట్ గా రాజమౌళి జపాన్ లో మాట్లాడుతూ నేను ప్రస్తుతం చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయింది. మెయిన్ లీడ్ తప్ప ఇంకెవరు కాస్టింగ్ కాలేదు. మెయిన్ లీడ్ గా కనిపించే వ్యక్తి పేరు మహేష్ బాబు. సినిమా రిలీజ్ టైం లో, ప్రోమోషన్స్ కి ఆయనను ఇక్కడికి తీసుకొచ్చి పరిచయం చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే మహేష్ బాబు చూడడానికే హాలీవుడ్ కటౌట్ లో ఉంటాడు. మళ్లీ ఈ హాలీవుడ్ యాక్టర్ ను హాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడు రాజమౌళి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు