Artist Satya : నాకు డబ్బింగ్ లో కూడా గ్లిజరిన్ కావాలి

ప్రముఖ కమెడియన్ మరియు ఆర్టిస్ట్ సత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మంచి వర్సటైల్ కమెడియన్ సత్య. కేవలం తన మేనరిజంతో తన టైమింగ్ తో అద్భుతంగా ప్రేక్షకులను అలరించడం సత్యకి వెన్నతో పెట్టిన విద్య. సత్య డైలాగ్ డెలివరీ కూడా చాలామందిని ఆకట్టుకుంటుంది. మంచి ఫన్ క్రియేట్ చేస్తుంది.

సత్య ఎన్ని సినిమాలు చేసినా కూడా సత్యకు మాత్రం మంచి గుర్తింపును తీసుకొచ్చిన సినిమా మత్తు వదలరా. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో సత్య కూడా వన్ ఆఫ్ ద హీరో అని చెప్పొచ్చు. హీరోతో పాటు ఈ సినిమాలో సత్య కూడా సినిమా మొత్తం కనిపిస్తాడు.

కేవలం ఈ సినిమాలో మాత్రమే కాకుండా చాలా సినిమాల్లో సత్య తనదైన పర్ఫామెన్స్ ను అందించి ప్రేక్షకులను అలరించాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన సత్య తరువాత జబర్దస్త్ షో తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో కమెడియన్ గా నిలదొక్కుకున్నాడు.

- Advertisement -

పిల్ల జమిందార్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్ట్ గా పనిచేసిన సత్య ఒక చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన స్వామి రారా సినిమాతో ఒక గుర్తింపు సాధించుకున్నాడు.
వెంటనే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రభస, రౌడీ ఫెలో, కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య, స్పీడున్నోడు, మజ్ను, జై లవకుశ, ప్రేమమ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కాయి.

ఇక ప్రస్తుతం చాలామంది కమెడియన్స్ దర్శకులుగా మారుతున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ షో తో గుర్తింపు సాధించుకున్న వేణు బలగం సినిమాతో దర్శకుడుగా మారాడు. అదే సినిమాతో బీభత్సమైన హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా ధనరాజు కూడా దర్శకుడుగా మారిన సంగతి తెలిసింది. కమెడియన్ గా నటుడుగా నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న ధనరాజ్ ఇప్పుడు దర్శకుడుగా కూడా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇకపోతే సముద్రఖని, ధన్ రాజ్ కాంబినేషన్లో రాబోతోన్న మూవీ రామం రాఘవం. ఈ సినిమాను పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ రోజున రాఘవం ఫస్ట్ లుక్ ను ఇరవై రెండు మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇకపోతే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమా డబ్బింగ్ లో పాల్గొన్నాడు ఆర్టిస్ట్ సత్య. అయితే సత్య డబ్బింగ్ థియేటర్లో కూడా గ్లిజరిన్ అడుగుతున్నాడు. మామూలుగా గ్లిజరిన్ కళ్ళల్లో నీళ్లు రావడానికి షూటింగ్లో ఆర్టిస్టులు అడుగుతూ ఉంటారు. కానీ డబ్బింగ్ థియేటర్లో కూడా సత్య గ్లిజరిన్ అడగడంతో… డబ్బింగ్ థియేటర్లో ఎవడు గ్లిజరిన్ అడగడు. డబ్బింగ్ థియేటర్లో గ్లిజరిన్ అడిగినవాడిని మొదటి నిన్నే చూస్తున్నాను. అంటూ ధనరాజ్ సత్యాకి సమాధానం ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు