Naga shaurya: రంగబలి సినిమాకి అతనొక్కడే ప్లస్ అంటా?

టాలీవుడ్ లో ఈ వారం అరడజను పైగా చిన్న సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో భాగ్ సాలే, రంగబలి ఎక్కువగా జనాలను అట్ట్రాక్ట్ చేస్తున్నాయి. భాగ్ సాలే పూర్తి కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కగా అందులో శ్రీ సింహా హీరోగా నటించాడు. ఇక మరో సినిమా రంగబలి లో నాగ శౌర్య హీరోగా నటించాడు. రంగబలి సినిమా కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

రంగబలి నుండి వచ్చిన టీజర్, ట్రైలర్ కూడా ఎంటర్టైనింగ్ గానే ఉండడంతో అదే బలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే చాలా మంది ట్రేడ్ విశ్లేషకులు ఇందులో కమెడియన్ సత్య కామెడీయే సినిమా మొత్తం హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరో తర్వాత పూర్తి స్థాయి రోల్ సత్య కే పడిందని, తన కామెడీ రంగబలి సినిమాకి చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు. సినిమా ప్రివ్యూ లు చూసిన కొంతమంది ప్రేక్షకులు కూడా కథ రొటీన్ గా ఉన్నా సత్య కామెడీ చాలా బాగుందంటున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ లో కూడా సత్య తో చేయించిన కామెడీ ఇంటర్వ్యూ నే హైలెట్ అయ్యిందని తెలిసిందే. ఒక రకంగా ఆ ఇంటర్వ్యూ చూసి చాలా మంది కామన్ ఆడియన్స్ సినిమా చూడ్డానికి వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక రంగబలి లోనే కాక భాగ్ సాలే సినిమాలోనూ సత్య మంచి రోల్ ప్లే చేసాడు. అయితే రంగబలి సినిమా లో సత్య కామెడీ మినహా వేరే సన్నివేశాలు అంతగా బాగోలేవని అంటున్నారు జనాలు. మరి సినిమా పూర్తి రివ్యూ వచ్చే వరకు జనాలు కూడా థియేటర్లకు వెళ్లేలా లేరు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు